వాడుకరి:Manish kmt/ప్రయోగశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అంకిత రైనా[మార్చు]

Manish kmt/ప్రయోగశాల
వ్యక్తిగత సమాచారం
జన్మనామంఅంకిత రవీందర్‌కృష్ణ రైనా
పౌరసత్వంభారతీయురాలు
జననంజనవరి 11, 1993
అహ్మదాబాద్‌, గుజరాత్‌.
ఎత్తు1.63 మీటర్లు (5 అడుగుల 5అంగుళాలు)


జనవరి 11, 1993లో జన్మించిన అంకిత రవీందర్‌కృష్ణ రైనా, భారతీయ ప్రొఫెషనల్ టెన్నిస్ క్రీడాకారిణి. మహిళల సింగిల్స్ మరియు డబుల్స్ రెండు విభాగాల్లోనూ ప్రస్తుతం దేశంలో నంబర్ వన్‌గా కొనసాగుతోంది.[1]


ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ సర్క్యూట్లో 11 సింగిల్స్ మరియు 17 డబుల్స్ టైటిళ్లతో పాటు డబుల్స్‌ విభాగంలో ఒక WTA 125K సిరీస్‌ను కూడా రైనా సాధించింది.  WTA 125K అనేది విమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ (WTA) ఏటా నిర్వహించే అంతర్జాతీయ టెన్నిస్ టోర్నమెంట్. 2012 - 2020 మధ్య కాలంలో నిర్వహించారు. 




ఏప్రిల్ 2018 లో, ఆమె మొదటిసారిగా ప్రపంచ ర్యాంకింగ్స్‌లోని సింగిల్స్ విభాగంలో టాప్ 200లో ప్రవేశించింది. అలా ఆ ఘనత సాధించిన ఐదవ భారతీయ క్రీడాకారిణిగా అవతరించింది. రైనా 2016 దక్షిణాసియా క్రీడల్లో మహిళల సింగిల్స్ మరియు మిక్స్‌డ్-డబుల్స్ ఈవెంట్లలో బంగారు పతకాలు సాధించింది. అలాగే 2018 ఆసియా క్రీడల్లో మహిళల సింగిల్స్‌లో కాంస్య పతకాన్ని గెల్చుకుంది.

2018 ఫెడ్ కప్‌లో ఆమె జు లిన్ (చైనా) మరియు యులియా పుటింట్సేవా(కజకిస్తాన్) లపై చెప్పుకోదగ్గ విజయాలు సాధించింది.[2]

వ్యక్తిగత జీవితం మరియు నేపథ్యం.[మార్చు]

రైనా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 11 జనవరి 1993 న జన్మించింది. ఆమె తండ్రి రవీందర్‌ క్రిషెన్ కశ్మీరు మూలాలు కల్గిన వ్యక్తి. ఆమె వారి ఇంటికి దగ్గరగా ఉన్న ఒక అకాడమీలో నాలుగేళ్ల వయసు నుంచే టెన్నిస్ డటం ప్రారంభించింది.[3]


అప్పటికే టెన్నిస్ ఆడుతున్న ఆమె సోదరుడు అంకుర్ రైనా ఆమెకు ప్రేరణగా నిలవగా... ఆమె తల్లి కేవలం క్రీడాభిమాని మాత్రమే కాదు టేబుల్ టెన్నిస్ క్రిడాకారిణి కావడం ఆమెకు మరింత కలిసొచ్చింది.[4]


రైనాకు 8 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అఖిల భారత టెన్నిస్ అసోసియేషన్ నిర్వహించిన టాలెంట్ హంట్‌లో రాష్ట్ర స్థాయి పోటీల్లో గెలిచిన తరువాత, మహారాష్ట్రకు చెందిన 14 ఏళ్ల అగ్రశ్రేణి క్రీడాకారిణిని ఓడించి చరిత్ర సృష్టించింది.



ఆమెకు మెరుగైన శిక్షణ ఇప్పించేందుకు 2007లో రైనా తల్లిదండ్రులు పూణేకి మకాం మార్చారు. అక్కడ కోచ్ హేమంత్ బింద్రేను ఆమె కలుసుకున్నారు. ఆపై ఆమె టెన్నిస్ ప్రయాణంలో ఆయన అత్యంత కీలక పాత్ర పోషించారు.[5]

వృత్తిపరమైన విజయాలు[మార్చు]

రైనా తొలిసారిగా 2012 న్యూదిల్లీలో జరిగిన పోటీల్లో తన మొదటి ప్రొఫెషనల్ సింగిల్స్ టైటిల్‌ను అలాగే డబుల్స్‌ విభాగంలో 3 టైటిళ్లను కైవసం చేసుకుంది.




ఆమె 2017 ముంబై ఓపెన్‌లో రెండు మ్యాచ్‌ల్లో గెలిచి, కెరియర్లో తొలిసారిగా ఒక పెద్ద ఈవెంట్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుండి. ఏప్రిల్ 2018 లో, ప్రపంచ ర్యాంకింగ్ జాబితాలో 197 వ స్థానానికి చేరుకుంది. అలా టాప్ 200 నిలిచిన ఐదో భారతీయురాలిగా రికార్డు సృష్టించి నిరుపమ సంజీవ్, సానియా మీర్జా, శిఖా ఉబెరాయ్ మరియు సునీతా రావుల సరసన నిలిచింది.[6]


2018 ఆగస్టులో ఇండోనేషియాలోని జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో , సింగిల్స్ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించింది రైనా.  ఇప్పటి సానియా మీర్జా తర్వాత టెన్నిస్ విభాగంలో ఆ ఘనత సాధించింది కేవలం రైనా మాత్రమే.[7]


ఫైనల్‌లో అరెంటా రస్‌పై విజయం సాధించడంతో సింగపూర్‌లో ఐటీఎఫ్ డబ్ల్యూ 25 టైటిల్‌ను రైనా గెల్చుకుంది. 2019 కున్మింగ్ ఓపెన్‌లో, మాజీ యుఎస్ ఓపెన్ ఛాంపియన్ మరియు టాప్ -10 ప్లేయర్ అయిన సమంతా స్టోసూర్‌ను ఓడించి ఆమె కెరీర్‌లో అతిపెద్ద విజయం సాధించింది.[8]


2019 ఫ్రెంచ్ ఓపెన్‌లో, బాగా ఆడినప్పటికీ, రైనా తన తొలి క్వాలిఫైయింగ్ మ్యాచ్‌ను అమెరికన్ యువ ప్లేయర్ కోకో గాఫ్ చేతిలో హోరా హోరీగా సాగిన రెండు సెట్లలో ఓడిపోయారు.  2019 వింబుల్డన్ ఛాంపియన్‌షిప్ , 2019 యుఎస్ ఓపెన్ రెండింటిలోనూ రెండవ క్వాలిఫైయింగ్ రౌండ్ వరకు రైనా చేరుకుంది.  తన క్రీడా భాగస్వామి రోసాలీ వాన్ డెర్ హోయెక్‌తో కలిసి 2019 సుజౌ లేడీస్ ఓపెన్ ఫైనల్స్‌కు చేరుకున్న తర్వాత, 2019 అక్టోబర్‌లో రైనా తొలిసారిగా టాప్ 150 డబుల్స్ ర్యాంకింగ్స్‌లోకి ప్రవేశించింది.[9]


2020 థాయ్‌లాండ్ ఓపెన్‌లో రోసాలీతో కలిసి రైనా మొదటిసారిగా డబ్ల్యూటీఏ టూర్ సెమీ-ఫైనల్‌కు చేరుకుంది. దీంతో ఆమె తన కెరియర్లోనే తొలిసారిగా 119 ర్యాంక్ సాధించింది. 2020 ప్రారంభంలో ఆమె సింగిల్స్ విభాగంలో రెండు టైటిళ్లు కూడ కైవసం చేసుకుంది.[10]


2020లో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆమె మొదటిసారి రెండవ క్వాలిఫైయింగ్ రౌండ్‌కు చేరుకుండి, కాని కురుమి నారా చేతిలో ఓటిమినెదుర్కొని ఇంటిబాట పట్టింది.[11]

ములాలు:[మార్చు]

  1. "Players Ranking | AITA". www.aitatennis.com. Retrieved 2021-02-17.
  2. "Ankita Raina". Wikipedia.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Ankita Raina Biography, Achievements, Career Info, Records, Stats - Sportskeeda". www.sportskeeda.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-02-17.
  4. ""She is waiting for her opportunity. And it will come – sooner or later" - Lalita Raina ji, sharing a mother's perspective, on the tennis journey of Ankita Raina". Indian Tennis Daily (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-03-24. Retrieved 2021-02-17.
  5. D'Cunha, Zenia. "Who is Ankita Raina? Meet India's top-ranked women's tennis player who impressed at Mumbai Open". Scroll.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-02-17.
  6. Srinivasan, Kamesh (2018-04-09). "Ankita Raina in top-200". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-02-17.
  7. Sudarshan, N. (2019-02-15). "Meet Ankita Raina, India's top-ranked woman tennis player". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-02-17.
  8. Srinivasan, Kamesh. "Ankita Raina stuns Samantha Stosur for biggest win of career". Sportstar (in ఇంగ్లీష్). Retrieved 2021-02-17.
  9. "Ankita Raina | Ranking History | Weekly & Yearly Rankings – WTA Official". Women's Tennis Association (in ఇంగ్లీష్). Retrieved 2021-02-17.
  10. Sportstar, Team. "Ankita Raina wins ITF title in Jodhpur". Sportstar (in ఇంగ్లీష్). Retrieved 2021-02-17.
  11. "Ankita Raina misses out on spot in French Open main draw". Olympic Channel. Retrieved 2021-02-17.