వాడుకరి:Mdevika273

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మిరపకాయలు


నేను ఆంద్ర లొయోల కళాశాల లో చదువుతున్నాను. ఇక్కడ చాలా కొర్సులు ఉన్నాయి.దీనిని 1953 లొ ఇగ్నేషియస్ లొయోల అనే వ్యక్తి ప్రారంభించారు.వివిధ రాష్ట్రాల నుండి చదువుకొవడానికి వస్తుంటారు.రకరకాల కొర్సులు నేరుపుతారు.నేను కూడ ఇక్కడ కొన్ని కొర్సులు బాగా నేర్చుకున్నాను.నేను ఇప్పుడు చాలా బాగా చదువుతున్నాను.నేను మూడు సంవత్సరాల నుండి ఇక్కడ చదువుతున్నాను.మాది గుంటూరు జిల్లా. గుంటూరు ప్రాంతంలో పాత రాతి యుగము నాటినుండి మానవుడు నివసించినాడనుటకు ఆధారములు కలవు. పాత రాతియుగపు (పేలియోలిథిక్) పనిముట్లు గుంటూరు జిల్లాలో దొరికాయి. వేంగీ చాళుక్య రాజు అయిన అమ్మరాజ (922-929) యొక్క శాసనాలలో గుంటూరు గురించిన ప్రధమ ప్రస్తావన ఉన్నది. 1147 మరియు 1158]టి రెండు శాసనాలలో కూడ గుంటూరు ప్రసక్తి ఉన్నది.

బౌద్ధం ప్రారంభం నుండి కూడా, విద్యా సంబంధ విషయాలలో గుంటూరు అగ్రశ్రేణిలో ఉంటూ వచ్చింది. బౌద్ధులు ప్రాచీన కాలంలోనే ధాన్యకటకము(ధరణికోట) వద్ద విశ్వవిద్యాలయమును స్థాపించారు. తారనాథుని ప్రకారము గౌతమ బుద్ధుడు మొదటి కాలచక్ర మండలాన్ని ధాన్యకటకములో ఆవిష్కరింపచేశాడు[2]. ప్రసిద్ధ బౌద్ధ తత్వవేత్త అయిన ఆచార్య నాగార్జునుడు ఈ ప్రాంతం వాడేనని, క్రీ.పూ 200 నాటికే ఈ ప్రాంతంలో అభ్రకము (మైకా) ను కనుగొన్నాడని తెలుస్తోంది.

ప్రతీపాలపుర రాజ్యం (క్రీ పూ 5వ శతాబ్ది) – ఇప్పటి భట్టిప్రోలు – దక్షిణ భారత దేశములో ప్రధమ రాజ్యంగా గుర్తింపు పొందింది. శాసన ఆధారాలను బట్టి కుబేర రాజు క్రీ. పూ. 230 ప్రాంతంలో భట్టిప్రోలును పరిపాలించాడని, ఆ తరువాత సాల రాజులు పాలించారని తెలుస్తున్నది. వివిధ కాలాల్లో గుంటూరును పాలించిన వంశాలలో ప్రముఖమైనవి: శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, ఆనందగోత్రీకులు, విష్ణుకుండినులు, చాళుక్యులు, చోళులు, కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు మరియు కుతుబ్ షాహీలు. గుంటూరు ప్రాచీనాంధ్రకాలమునాటి కమ్మనాడు, వెలనాడు, పలనాడు లో ఒక ముఖ్యభాగము. కొందరు సామంత రాజులు కూడ ఈ ప్రాంతాన్ని పాలించారు. ఈ సామంతుల మధ్య కుటుంబ కలహాలు, వారసత్వ పోరులు సర్వసాధారణంగా ఉండేవి. అటువంటి వారసత్వపోరే ప్రసిద్ధి గాంచిన పలనాటి యుద్ధం. జిల్లాలోని పలనాడు ప్రాంతంలో 1180 లలో జరిగిన ఈ యుద్ధం "ఆంధ్ర కురుక్షేత్రం" గా చరిత్ర లోను, సాహిత్యంలోను చిరస్థాయిగా నిలిచిపోయింది.

687లో ఔరంగజేబు కుతుబ్‌ షాహి రాజ్యాన్ని ఆక్రమించినపుడు గుంటూరు కూడా మొగలు సామ్రాజ్యం లో భాగమయింది. సామ్రాజ్యపు రాజప్రతినిధి ఆసఫ్‌ ఝా 1724లో హైదరాబాదుకు నిజాముగా ప్రకటించుకొన్నాడు. ఉత్తర సర్కారులు అని పేరొందిన కోస్తా జిల్లాలను ఫ్రెంచి వారు 1750 లో ఆక్రమించుకొన్నారు. 1788లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏలుబడి లోనికి వచ్చి, గుంటూరు మద్రాసు ప్రెసిడెన్సీ లో భాగమైంది. 1794లో 14 తాలూకాలతో జిల్లా ఆవిర్భవించింది. ఆవి: దాచేపల్లి, ప్రత్తిపాడు, మార్టూరు, ఠుంఠురుకొర, మంగళగిరి, బాపట్ల, పొన్నూరు, రేపల్లె, తెనాలి, గుంటూరు, కూరపాడు, కొండవీడు, నరసరావుపేట, వినుకొండ. 1859లో జిల్లాను రాజమండ్రి, మచిలీపట్నం జిల్లాలతో విలీనం చేసి కృష్ణా గోదావరి జిల్లాగా నామకరణం చేసారు. 1904 లో తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, పలనాడు, బాపట్ల, నరసరావుపేట, వినుకొండ తాలూకాలను వేరు చేసి మళ్ళీ జిల్లాను ఏర్పాటు చేసారు.

భారత స్వాతంత్ర్య సంగ్రామం లోను, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఏర్పాటు లోను జిల్లా ప్రముఖ పాత్ర వహించింది. 1947 లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినపుడు మద్రాసు ప్రెసిడెన్సీ మద్రాసు రాష్ట్రం లో భాగం అయింది. మద్రాసు రాష్ట్రం లోని తెలుగు మాట్లాడే జిల్లాలు ప్రత్యేక రాష్ట్రం కావాలని వాదించాయి. ఫలితంగా 1953 లో 11 జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. 1970 ఫిబ్రవరి 2 న ప్రకాశం జిల్లా ఏర్పాటు చేసినపుడు జిల్లా రూపురేఖలలో మళ్ళీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఒంగోలు తాలూకా మొత్తం, బాపట్ల, నరసరావుపేట, వినుకొండ తాలూకాలలోని కొన్ని ప్రాంతాలను విడదీసి ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేసారు. దీనితో జిల్లా వైశాల్యం 15032 చ. కి. మీ నుండి 11,347 చ. కి. మీ కి తగ్గిపోయింది. భౌగోళిక స్వరూపం

గుంటూరు జిల్లా సగటున 33 మీటర్లు ఎత్తులో వుంది. చాలవరకు సమతల ప్రదేశం. కొన్ని కొండలు కూడా కలవు. కృష్ణా డెల్టా కొంతభాగం దీనిలో కలదు. కొండలు

నల్లమలై, వెంకటాయపాలెం శ్రేణులు మరియు కొండవీడు కొండలు

నల్లమలై కొండలు

పల్నాడు చుట్టూ కర్నూలు జిల్లాలో ని నల్లమలై కొండలున్నాయి. మాచర్ల యర్రగొండపాలెం శ్రేణిలో స్వామికొండ లేక వామికొండ (605 మి) ఎత్తులో గలదు. కైరాలకొండ (590 మీ) తరువాత ఎత్తైన కొండ. వాయవ్య అంచున గల కొండలు మల్లవరం దగ్గర కృష్ణానదిలో కలిసేవరకు వున్నాయి. వీటిలో ముఖ్యంగా పలకరాయి మరియు క్వార్ట్జైట్ రాయి లభిస్తుంది. మాచర్ల కు పదికిమీ దూరంలో ఎత్తిపోతల అనబడే జలపాతం నల్లమలై కొండలపై చంద్రవంక నదిపై వుంది. దీనిలో 21మీ ఎత్తునుండి నీరు పారుతుంది.

వెంకటాయపాలెం శ్రేణి

సత్తెనపల్లి దగ్గరలోని వెంకటాయపాలెం పేరుకలగిన పలకరాయి మరియు క్వార్ట్జైట్లు గల కొండలే ఇవి. 40 కిమీ పొడవుతో ఈశాన్య -నైరుతీ దిక్కున వుంటాయి. వీటిలో వజ్రాలు కనుగొన్నారట. దీనిలో ఎత్తైనది మైదర్సాల్ (447 మి). నరసరావుపేట దగ్గర పల్నాడు, వినుకొండ మరియు సత్తెనపల్లి సరిహద్దులు కలిసేచోట కృష్ణానదివైపుకు ఎత్తుతగ్గుతూ వుండే కొండలు వున్నాయి.

కొండవీడు

నరసరావుపేట దగ్గర గ్రానైట్ రాయి గల 19 కిమీ విస్తరించి, 523మీ ఎత్తువరకు కలకొండలు. దీనికి పశ్చిమంగా వేరుగా వున్న యల్లమంద లేక కోటప్పకొండ అని పిలవబడే489మీ ఎత్తులో వున్నది. దానికి దక్షిణంగా అద్దంకి వైపు కొన్ని కొండలున్నాయి. మంగళగిరి మరియు విజయవాడ మధ్య కొన్ని కొండలు