వాడుకరి:Mitra4f/ప్రయోగశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గ్రెట థన్ బర్గ్[మార్చు]

గ్రెట టిన్టిన్ ఇలియోనోర ఎర్న్ మన్ థన్ బర్గ్ (జననం జనవరి, 3, 2003) స్వీడన్ దేశపు పర్యావరణ ఉద్యమకారిణి. చిన్నవయసులోనే అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. ముక్కుసూటిగా మాట్లాడే స్వభావం తో రాజకీయనాయకులను, అధికారులను, వ్యాపారవేత్తలను పర్యావరణం లోని వాతావరణ మార్పు పై నిలదీసి అడగడం ఆమె ప్రత్యేకత. ఎంతో మంది యువకులను, ప్రజలను ప్రభావితం చేసే ఉపన్యాసాలు ఇస్తూ వాతావరణ సంక్షోభాన్ని నిలువరించే ప్రయత్నం చేస్తుంది.[మార్చు]

థన్ బర్గ్ మొట్టమొదట 15 ఏళ్ళ వయసులో “వాతారణం పై పాఠశాల ధర్నా” పేరుతొ స్వీడన్ పార్లమెంట్ బయట “స్కోల్ స్ట్రైక్జ్ ఫర్ క్లిమటేట్” (వాతావరణం పై పాటశాల ధర్నా) అని స్వీడన్ భాష లో రాయబడ్డ ప్లకార్డ్ లను పట్టుకొని ధర్నా చేసేది. దీనితో అన్ని పాఠశాలల విద్యార్ధులు  ఈమెతో పాటు ధర్నాలో పాల్గొన్నారు. ఇతర ప్రాంతాలలో విద్యార్ధులు కూడా ధర్నాలు చేయటం ప్రారంభమైంది.   ఇప్పుడు ఈ ఉద్యమమే పెద్దఎత్తున భవిష్యత్తుకోసం శుక్రవారాలు (ఫ్రై డేస్ ఫర్ ఫ్యూచర్) అనే పేరుతొ ప్రచారం లోకి వొచ్చింది. 2018 లో జరిగిన అంతర్జాతీయ వాతావరణ సదస్సులో గ్రేట ప్రసంగించిన తరువాతనుంచి ప్రతివారం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడో ఒక దగ్గిర ఈ ఉద్యమం జరుగుతూ ఉంది.  థన్ బర్గ్ వాతావరణ మార్పుకు కారణమైన కర్బన అడుగుజాడలను తగ్గించటానికి విమాన ప్రయాణాన్ని, మాంసాహారాన్ని మానేయటానికి తన కుటుంబసభ్యులను ఒప్పించింది.

         మే 2009 లో టైమ్ పత్రిక వారు గ్రెట ను “తరువాతి తరం నాయకురాలు” గా పేర్కొంటూ పైపేజి(కవర్ పేజి) లో ప్రచురించి ఎంతో మందికి మార్గదర్శకురాలుగా ఉంటుంది అని పేర్కొన్నారు. ఆమె పై “గ్రెట, మళ్ళీ ప్రపంచాన్ని తయారుచెయ్యి” అంటూ ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని కూడా రూపొందించారు. ఆమె ప్రపంచం మొత్తం వాతావరణ మార్పుపై తీసుకొచ్చిన ఈ మార్పును “గ్రెట ప్రభావం” గా పేర్కొన్నారు. థన్ బర్గ్ ఎంతోమందిని ప్రభావితం చేసి వాతావరణ మార్పు పై పోరాడుతున్నందుకు గాను ఎన్నో అవార్డ్ లను పొందారు.

అవార్డులు:[మార్చు]

1.    చిల్డ్రన్స్ క్లైమేట్ ప్రైజ్, నవంబర్ 2018.

2.    స్వీడిష్ వుమెన్ అఫ్ ది ఇయర్, మార్చ్,2019.

3.    రాచెల్ కార్సన్ ప్రైజ్, మార్చ్ 2019.

4.    టైమ్స్ మగజేన్ వారి పత్రిక కవర్ పేజి పై "తరువాతితరం నాయకురాలు"గా, "మార్గదర్శకురాలి"గా పేర్కొనబడింది.

5.    రాయల్ స్కాటిష్ జియోగ్రాఫికల్ సొసైటీ వారి గెద్దేస్ ఎన్విరాన్మెంటల్ మెడల్, జూలై 2019.

6.    రైట్ లైవ్లీహుడ్ అవార్డ్, సెప్టెంబర్ 2019.

7.    అంతర్జాతీయ చిన్నపిల్లల శాంతి బహుమతి , అక్టోబర్, 2019.

వనరులు:[మార్చు]

1.      https://en.wikipedia.org/wiki/Greta_Thunberg