Jump to content

వాడుకరి:Mpradeep/ఇసుకపెట్టె2

వికీపీడియా నుండి


చూడు, చిరునామా మూసలు

[మార్చు]

నేను ఈ మూసలను[1][2] ఆంగ్ల వికీపీడియా[3][4] నుండి తీసుకుని వచ్చాను. రిఫెరెంసులు అనేవి మనము రాసే వ్యాసాలకు ఎంతో ముఖ్యమైనవి. ఈ మూసలను ఉపయోగిచటం వలన మనము రిఫరెంసులను ఒక క్రమ పద్దతిలో పెట్టవచ్చు. మనము రాసే వ్యాసాలలో వాక్యాల నిజానిజాలను రుజువు చేసేందుకు కొన్ని సాక్ష్యాలు కావలిసి వస్తుంది. వాటిని వికీపీడియాలో ఉంచటం తప్పని సరి. అందుకోసం మనము ఒక నమ్మకమైన మూలము నుంచి సేకరించిన విషయాన్ని సాక్ష్యముగా ఇవ్వవలసి ఉంటుంది. ఆలాంటి సాక్ష్యాలు ఇవ్వటం వలన మన వ్యాసాల నాణ్యత పెరగటంతో పాటుగా, చదివేవారికి ఒక రకమయిన నమ్మిక ఏర్పడుతుంది. దీనికి నేను ఒక చిన్న ఉదాహరన ఇస్తాను. ప్రస్తుతం వికీపీడియాలో నేను 800 పై చిలుకు మార్పులు చేర్పులు చేసాను అని చెబితే చదివేవారు దీనిని ఎలా నిర్ధారించుకోవాలో తెలియక కొంచెం సంధిగ్ధంలో ఉంటారు. అంటే మీరు చెప్పిన విషయాన్ని పూర్తిగా నమ్మట్లేదన్నమాట. పై వాక్యానికి నిర్ధారించుకోగలిగే ఒక సాక్ష్యాన్ని జతచేస్తే అప్పుడు ఆ వాక్యము ఇలా ఉంటుంది. ప్రస్తుతం వికీపీడియాలో నేను 800 పై చిలుకు మార్పులు చేర్పులు చేసాను [5].

ఉపయోగించు విధానము

[మార్చు]

ఈ మూసలను మీరు మార్పులు చేస్తున్న వ్యాసములో ఈ విధముగా ఉపయోగించాలి.

{{చూడు|పేరు}} - ఈ మూసను వ్యాసము మధ్యలో ఉపయోగించాల్సి ఉంటుండి. మీరు చేర్చబోయే ఏదయినా అంశమునకు ఆధారాలు, రుజువులు అవసరమయిన చోట్ల ఈ మూసను తగిలించండి. పేరు అనేది మీరు ఇచ్చే ఆధారాలకు లేదా మూలాలకు గుర్తుగా, వ్యాసములో ఉన్న మరే ఇతర పేర్లతో కలిసిపోకుండా ప్రత్యేకంగా ఇవ్వవలిసిన నామము. దీంతో మీరు చేర్చిన విషయం నుండి మూలాన్ని చేరుకోవడానికి ఒక లింకు ఏర్పడుతుంది.

{{మూలం|పేరు}} - ఈ మూసను మూలాలు లేదా రిఫరెంసులు విభాగాలలో, మూలాల చిరునామాకు ముందు తగిలించవలసి ఉంటుంది. దానివలన ఒక ఈ మూలము నుండి ఏ విషయానయితే సేకరించారో ఆ వివరణకు ఒక లింకు ఏర్పడుతుంది.

ఈ మొత్తం ప్రక్రియ వలన చదివేవారు మన రచనలను సులువుగా నిర్ధారించోగలుగుతారు, తద్వారా వికీపిడియా మీద మరింతగా నమ్మకం పెంచుకుంటారు. ఈ మధ్య ఆంగ్ల వికీపిడియాలో ఇలాంటి నమ్మకం పెంచటం ఒక అవసరంగా భావిస్తున్నారు[6][7].

రిఫరెంసులు

[మార్చు]
  1. ^  చూడూ మూసకు లింకు
  2. ^  చిరునామా మూసకు లింకు
  3. ^  చూడు యొక్క ఆంగ్ల మూస
  4. ^  చిరునామా యొక్క ఆంగ్ల మూస
  5. ^  కేటు సాధనం ద్వారా రచనల సంఖ్య కనుక్కోండి
  6. ^  వికీపీడియాను మూలంగా ఉపయేగించవచ్చా?(ఆంగ్లం)
  7. ^  వికీపీడియా అంత గొప్పది కాదు ఎందుకని?(ఆంగ్లం)