1
కవయిత్రి మొల్ల ( ఆతుకూరి మొల్ల ) rachanaN: Munikumar మాస్టర్ ఆఫ్ హ్యుమానిటీస్ (B.sc, M.A') తెలుగు విద్యార్థి తెలుగు శాఖ యోగి వేమన విశ్వవిద్యాలయం కడప. పరిచయం: రచయిత్రి : ఆతుకూరి మొల్ల( కవయిత్రి మొల్ల) తండ్రిగారి పేరు: ఆతుకూరి కేసయ సెట్టి, కాలము 16వ శతాబ్దము నివాస స్థలము: కడప జిల్లా గోపవరం మండలము గోపవరం గ్రామం. రచనలు మొల్ల రామాయణం.... వివరణ: తెలుగులో తొలి రామాయణం రచించిన కవయిత్రి ఆతుకూరి మొల్ల గారు. వీరి పూర్వీకులు నెల్లూరు జిల్లాకు చెందిన ఆత్మకూరు వాస్తవ్యులు కవయిత్రి మొల్ల తండ్రిగారి పూర్వీకులు ఆత్మకూరు నుండి కడప జిల్లా నందలి బద్వేలు కు సమీపంగా వుండే గోపవరం గ్రామమునకు వలస వచ్చారు వీరి కుమ్మరి కులస్తులు. కవయిత్రి మొల్ల తల్లిగారి పేరుకు సంబంధించిన ఆధారాలు పూర్తిగా లభించలేదు . కవయిత్రి మొల్ల గారి తల్లి ఆమె చిన్న వయసులోనే పరమపదించింది. తండ్రిగారు ఈమెను అల్లారుముద్దుగా పెంచారు. కవయిత్రి మొల్ల "వివాహం చేసుకున్నాదా& చేసుకోలేదా" అన్న విషయంలో ఆధారాలు లభించలేదు. సంస్కృతంలో వాల్మీకి మహర్షి రచించిన సంస్కృత రామాయణం ను తెలుగులోనికి అనువదించిన తొలి తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్ల గారు . సంస్కృతంలోని రామాయణమును జన వ్యవహారిక భాష లందు అలతి అలతి మాటలతో "తేనె సోకగ నోరు తీయన గు రితీ" అంటూ తేట తెలుగు భాషలో సరళమైన రీతిలో కేవలం అతి తక్కువ పద్యాలతో సంస్కృత రామాయణంలో కథాకథనం శిల్పము మరియు కథావస్తువు భావగాంభీర్యం నందు ఎటువంటి భావనలు లేకుండా మూలంలోని అర్థం చెడకుండా తెలుగు భాష లందు రామాయణ రచనకు శ్రీకారం చుట్టింది. సంస్కృత రామాయణ రచనకు మూలం మొల్ల రామాయణము అనే భావనను పాఠకలోకంలో కలిగించే విధముగా కవయిత్రి మొల్ల గారి రామాయణ రచన జరిగినది. మొల్ల రామాయణం లోని బాలకాండ నందు "పుత్రకామేష్టి యాగం శ్రీరామ జననం తాటక వధ అహల్యా శాప విమోచనము" మరియు కిష్కింధకాండము యుద్ధకాండఅయోధ్య కాండలోని సన్నివేశములు ఇందుకు అద్దం పడుతున్నాయి. శ్రీరాముడు శ్రీ కంఠ మల్లేశ్వరుని దయ వలన మాత్రమే నేను ఈ రామాయణ రచన చేయగలిగాను అని కవయిత్రి మొల్ల గారు స్వయానా తన అవతారికలో చెప్పుకున్నారు. గోపవరం గ్రామమునందు శిథిలావస్థలో ఉన్న శ్రీ కంఠ మల్లేశ్వరుని దేవాలయమును నేటికి మనము చూడవచ్చు కవయిత్రి మొల్ల గారు శ్రీ రామాయణ రచన చేస్తున్నారని రాయల అష్ట దిగ్గజ కవులలోని తెనాలి రామలింగడు అల్లసాని పెద్దన..... హేళన చేస్తూ "చాటు పద్యాలు" చెప్తారని ఒక కథ ప్రచారంలో ఉన్నది. కవయిత్రి మొల్ల గారి పాండిత్య పటిమను తెలుసుకున్నట్టు వంటి విజయనగర సామ్రాజ్యపు రాజు అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు తమ రాజాస్థానంలో ఉండమని అభ్యర్థించగా తిరస్కరించిన అటువంటి కవయిత్రి మహాకవి పోతన లాగా శ్రీరామునికి మహాభక్తురాలు మరియు రాజా స్థానమును తిరస్కరించిన ...