వాడుకరి:Nagam Thirmal Reddy/ప్రయోగశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నాగం తిరుపతి రెడ్డి నాటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నేటి నాగర్ కర్నూల్ జిల్లాలోని, రేవల్లి మండలం నాగపూర్ గ్రామంలో అతి సామాన్య రైతు కుటుంబంలో నాగం కృష్ణా రెడ్డి, సుభద్రమ్మ దంపతులకు 1974 డిసెంబర్ 25 తేదీన 5వ సంతానంగా జన్మించారు. నాగం కృష్ణా రెడ్డి కమ్యూనిస్ట్ నాయకుడు కావటం మూలానా నాగం తిరుపతి రెడ్డి గారికి కూడా సామ్యవాద భావాలూ అలవాటుఅయ్యాయీ, చిన్నప్పటి నుండి కూడా సామాజిక సేవ అంటే చాల ఇష్టం. చదివింది తక్కువే అయినప్పటికీ జీవిత సారాన్ని మొత్తం ఒడకట్టారు. వ్యాపారంలో అగ్రగామిగా ఎదుగుతూనే సామాజిక సేవను మాత్రం ఏ రోజు విస్మరించలేదు. తాను సంపాదించినా దాంట్లో 30 శాతం సామజిక సేవ కార్యక్రమాలకు ఖర్చు పెడుతూవుంటారు. ఈ క్రమంలోనే నాగం తిరుపతి రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించి ట్రస్ట్ ద్వారా తన సామాజిక కార్యక్రమాలను ఉదృతం చేసారు. వితంతువులకు పెన్షన్, వృద్దులకు ఆశ్రయం, పేద విద్యార్థులకు విద్యాదానము, పేద ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్ధిక సహాయం, పేదలలో చనిపోయిన వారికీ దహన సంస్కారాల ఖర్చుతో పాటుగా వారికీ నేనున్నాను అనే భరోసా కల్పిస్తూ పెద్దన్నగా వ్యవహరిస్తున్నారు. తన దగ్గరకు వచ్చిన వారికీ కాదనకుండా ఇచ్చి పంపడం నాగం తిరుపతి రెడ్డి గారి సేవాదృక్పధానికి మచ్చుతునక. సామజిక సేవ రంగంలోనే కాకుండా ఆధ్యాత్మిక రంగంలో కూడా తనదైన ముద్రను వేశారు నాగం తిరుపతి రెడ్డి గారు... నాగర్ కర్నూల్ జిల్లాతో పాటుగా భాగ్యనగరంలో ఎన్నో దేవాలయాల నిర్మాణానికి ఆర్ధిక సహాయం చేసి తన దైవ భక్తిని చాటారు. హిందూ దేవాలయలతో పాటుగా మసీద్ లకు చావడిలకు సహాయం చేసి తన పరమత సహనాన్ని చాటుకున్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని నిత్యం అన్నదానం చేస్తూ కావలిసినంత పుణ్యాన్ని తన ఖాతాలో వేసుకుంటున్నారు.