వాడుకరి:Nikhitha17/ప్రయోగశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శుశ్రీ దివ్య దర్శిని ప్రధాన్[మార్చు]

శుశ్రీ దివ్య దర్శిని ప్రధాన్ భారతీయ మహిళా క్రికెటర్. కేవలం కుడి చేతి వాటం కల్గిన ఆఫ్ స్పిన్నర్ మాత్రమే కాదు అవసరమైతే బ్యాటింగ్ కూడా చేయగలరు.[1]  అండర్ 23 విమెన్స్ ఛాలెంజర్ ట్రోఫీలో ఆమె నేతృత్వంలో భారత జట్టు ఫైనల్స్‌కు కూడా చేరుకుంది.

యూఏఈలో జరిగిన విమెన్స్ టీ-20 ఛాలెంజ్‌లో ఆమె వెలాసిటీ క్రికెట్ ఫ్రాంచైజీ టీంకు ఎంపికయ్యారు.  అలాగే దేశవాళీ క్రికెట్ పోటీలలో ఒడిషా అండర్-23 జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించారు. ఏసీసీ విమెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఏసియా కప్‌లో భారత జట్టు తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచారు.

Nikhitha17/ప్రయోగశాల
వ్యక్తిగత సమాచారం
జన్మనామంసుశ్రీ దివ్య దర్శిని ప్రధాన్
జననంఅక్టోబర్ 8, 1997
థెంక్నెల్, ఒడిషా
క్రీడ
క్రీడక్రికెట్
జట్టుభారత్, ఒడిషా రాష్ట్రం, టీం వెలాసిటీ

[2]

వ్యక్తిగత జీవితం-నేపథ్యం[మార్చు]

శుశ్రీ దివ్య దర్శిని ప్రధాన్  అక్టోబర్ 8 1997న ఒడిషాలోని ధింకినెల్‌లో జన్మించారు ఏడేళ్ల వయసులో తమ కాలనీలో తోటి కుర్రాళ్లతో కలిసి సరదాగా క్రికెట్ ఆడేవారు. అక్కడే ఆమెకు క్రికెట్ పట్ల ఆసక్తి పెరుగుతూ వచ్చింది. అయితే ఆమె తండ్రి ఆమె ఆసక్తిని వేరే క్రీడ వైపు మరల్చాలనుకున్నారు. కారణం.. భారత దేశంలో మహిళల క్రికెట్ జట్టు ఉందని కానీ, అసలు ఆడపిల్లలు క్రికెట్ ఆడతారని కానీ ఆమెకు, ఆమె తండ్రికి తెలియదు.[2]

కానీ అప్పటికే ఆమె క్రికెట్‌ క్రీడే ప్రాణంగా భావించే స్థాయికి వచ్చేశారు. దీంతో 15 ఏళ్ల వయసులో ఆమెను కిరోడ్ బెహరా నేతృత్వంలో నడుస్తున్న జాగృతి క్రికెట్ క్లబ్‌లో శిక్షణ ప్రారంభించారు. ఇప్పటికీ కిరోడ్ ఆమెకు కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. పక్కా ప్రణాళికతో కూడిన శిక్షణకు తోడు ఆమె కృషి, ప్రాక్టీస్ కారణంగా ఫలితం చాలా త్వరగా కనిపించడం మొదలయ్యింది. జోనల్ టోర్నమెంట్లలో తన రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించడం ప్రారంభించారు ప్రధాన్. కెరియర్ విషయంలో తన తల్లిదండ్రులు అత్యంత కీలక పాత్ర పోషించారని ఆమె చెబుతుంటారు. క్రికెట్‌తో పాటు సినిమాలు చూడటం, నటించడం ఆమెకు చాలా  ఇష్టం. క్రికెట్ ఆధారంగా నిర్మించిన తమిళ సినిమా “కన్న”లో ఆమె నటించారు కూడా.

వృత్తి పరమైన విజయాలు[మార్చు]

శుశ్రీ 2012 నుంచి ఒడిషా జట్టుకు ప్రాతినిధ్యం వహించేవారు.  ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్ టోర్నమెంట్లలో అండర్-23 ఒడిషా జట్టుకు ఆమె కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. జోనల్ పోటీల్లో ఆమె చూపిన ప్రతిభ కారణంగా 2019లో జరిగిన గ్రీన్ టీం అండర్-23 విమెన్స్ ఛాలెంజర్ ట్రోఫీలో చోటు సంపాదించారు. తన అత్యుత్తమ ప్రదర్శనతో తన జట్టుకు ఫైనల్స్ వరకు తీసుకెళ్లినప్పటికీ  ఫైనల్స్‌లో ఇండియా బ్లూ టీం చేతుల్లో గ్రీన్ టీం ఓటమి పాలయ్యింది.[1]

2019లో జరిగిన ఏసీసీ విమెన్స్ ఎమెర్జింగ్ టీమ్స్ ఏసియా కప్‌లో భారత మహిళా క్రికెట్ జట్టులో ఆమె చోటు సంపాదించారు. ఆ టోర్నమెంట్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచారు. ఆ తరువాత 2020లో యూఏఈలో జరిగిన విమెన్స్ టీ-20 ఛాలెంజ్‌లో విమెన్స్ క్రికెట్ ఫ్రాంచైజీ వెలాసిటీ జట్టుకు ఎంపికయ్యారు. భారత మాజీ కెప్టెన్, లెజండరీ క్రికెటర్ మిథాలీ రాజ్ నేతృత్వంలో ఆమె ఆడారు.  ప్రస్తుతం ఇండియా సీనియర్ జట్టులో చోటు సంపాదించడమే ఆమె లక్ష్యం. ఆపై ఈ దేశానికి ప్రపంచ కప్ సంపాదించి పెట్టాలన్నది ఆమె ధ్యేయం.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "player".{{cite web}}: CS1 maint: url-status (link)
  2. 2.0 2.1 "bbctelugu".{{cite web}}: CS1 maint: url-status (link)