Jump to content

వాడుకరి:P V V Satyanarayana/ర్యాంకు ముఖ్యమా ? నాలెడ్జి ముఖ్యమా ?

వికీపీడియా నుండి


ఉపోద్ఘాతము

[మార్చు]

ఈ ఆధునిక సమాచార సాంకేతిక యుగంలో చదువుల వేగం పెరిగింది .
ఉద్యోగాల రూపురేఖలు మారిపోయాయి .
అవసరాలు పెరుగుతున్నాయి .
అందుకు తగిన కొత్త కోర్సులు పుట్టుకొస్తున్నాయి . 
అభిరుచులకు తగిన చదువులు . . . 
ఉన్నత స్థాయికి చేర్చే ఉద్యోగాలు పొందేందుకు ఉపయోగపడే చదువులు . . .
సమాజ సేవలో పునీతులను చేసే చదువులు . . . 
స్వశక్తిపై నిలబడేందుకు సాయపడే చదువులు . . .
సంపాదనే సర్వస్వంగా సాగే చదువులు . . . 
ఆధునిక పోకడలకు అద్దం పట్టే చదువులు . . . 
కళాకౌశలాన్ని వెలికితీసే చదువులు . . . 
ఇన్ని రకాల చదువులు . . . 
ఇంకెన్నో చదువులు . . .
మరెన్నో రకాల ఉద్యోగాలు . . . 
వీటన్నింటికీ తగినవారిని ఎంచుకొనేందుకు రకరకాల పోటీ పరీక్షలు . . .
వారి ప్రజ్ఞను బట్టి ర్యాంకులు . . .

"""చదువనివాడజ్ఞుండగు

జదివిన సదసద్వివేక చతురత గలుగుం

జదువగ వలయును జనులకు ,

జదివించెద నార్యులొద్ద జదువుము తండ్రీ ! """

విద్య యొక్క గొప్పతనాన్ని ఈ పద్యరూపంలో చెప్పిన వ్యక్తి మన పురాణాల్లో రాక్షసుడిగా పేరొందిన హిరణ్యకశిపుడు . అతడు తన కుమారుడైన ప్రహ్లాదునితో , విద్య అనేది మహోన్నత వ్యక్తిగా జీవించడానికి అవసరమైనా విజ్ఞానాన్ని అందిస్తుందనీ , విద్య లేనివాడు అజ్ఞానిగా పరిగణించబడతాడని , కాబట్టి విద్యనభ్యసించి ఆ జ్ఞానాన్ని సంపాదించమని చెబుతాడు .


ఒకప్పుడు చదువు అంటే విద్య , విజ్ఞానం అనే రెండు వేర్వేరు అర్థాలుగా ఉండేది కాదు . కాని నేడు ఇది ఎన్నో విభాగాలుగా విడిపోయింది . అది తన విలువలను కోల్పోయి విలువకట్టే వస్తువైపోయింది . ప్రపంచానికి మన బంధుత్వం ఏమిటో తెలియచెప్పేదే విద్య అన్నారు. పరీక్షలు, కోచింగులు అంటూ ఉదయం నుంచి రాత్రి వరకు పిల్లవాడ్ని తరమటంలోనే తల్లిదండ్రులందరూ పోటీ పడుతున్నారు.. కానీ జీవితానికి అవసరమైన ‘నడక’ నేర్పడంలో సఫలం కాలేకపోతున్నారు. ఒక పిల్లవాని విద్య అతను పుట్టడానికి వందేళ్ల ముందు ప్రారంభం అవ్వాలని అంటారు ఓ రచయిత. అంటే పిల్లవాని విద్యలో తల్లిదండ్రుల బాధ్యత ఏమిటో చెప్పకనే చెపుతుంది ఈ వాక్యం. ఇక్కడ విద్య అంటే పుస్తకాల్లోను, స్కూళ్లలో నేర్చుకున్న విద్య కాదు, తరతరాలుగా మానవ జాతికి అందిస్తున్న మానవీయ విలువల సమాహారం. తల్లిదండ్రులు సన్మార్గాన్ని ఆచరిస్తూ పిల్లల్ని అలానే పెంచితే సంఘానికి మేలు చేసినట్లే. తల్లిదండ్రుల అలవాట్లు, ఆచార వ్యవహారాలు, గృహవాతావరణం పిల్లల్ని ఎంతో ప్రభావితం చేస్తాయి.

తెలుగు భాషలో వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన సాహిత్యం వెలువాడడం ఇప్పుడిప్పుడే మొదలౌతుంది . తల్లిదండ్రులు ప్రవర్తన , బాల్యదశ అనుభవాలు , పరిసరాల ప్రభావం , సామాజిక , ఆర్థిక , సాంస్కృతిక పరిస్థితులు ప్రభావంతో మానవుడు తన వైఖరిని నిర్ణయించుకున్నాడు . అది తనకు, ఇతరులకు ఇబ్బంది కలిగించనంత కాలం మంచిదే , కాని పక్షాన తన వ్యక్తిత్వాన్నితగిన విధంగా పునఃనిర్మాణం చేసుకోవలసిన బాధ్యత ఉంది . ఆ బాధ్యత దృష్టిలో ఉంచుకుని నేటితరానికి అవసరమైన వ్యాసాలు వ్రాయాలి .అటువంటి వ్యాసాలు వ్రాసేందుకు ప్రోత్సహిస్తున్న వికీపిడీగా యాజమాన్యానికి ధన్యవాదాలు .


విషయం

[మార్చు]

సృష్టిలోని జీవరాశిలన్నింటిలో భౌతికంగా తనని తాను రక్షించుకోలేని దురదృష్టజీవి మానవుడే . అతను పక్షిలాగ ఎగరలేడు . చిరుతపులిలాగ వేగంగా పరుగు తీయలేడు . చేపలాగ ఈదలేడు . సింహంలాగా పంజాలు లేవు . పాములాగా కాటు వేయలేడు . దోమ చిన్నకాటు వేసినా హరీమంటాడు . అలాంటి మానవుడుకి ఉన్న గొప్ప శక్తి ఆలోచన. తన చుట్టూ ఉన్న పరిసరాలను తనకు అణువుగా మార్చుకున్నాడు . రాళ్ళతో మంట సృష్టించాడు . ఈ శక్తులనే వాడు ఇతర జంతువులపై ఆధిపత్యం సాధించాడు . ఇన్ని అద్భుతాలు చేసినవాడు , ఎన్నొ క్రూరమృగాలను మచ్చిక చేసుకున్నవాడు తన విషయంలో విఫలమౌతున్నాడు .

ప్రస్తుత విద్యార్థులు , ముఖ్యంగా యవ్వనంలో ఉన్న యువత ఆలోచనా విధానం నెమ్మదిగా ప్రవహిస్తున్న నదులవలె ఉంది . అదికూడా ఒక నిర్ణీత దిశలేని నదిలా ఉంది . అది ఎందుకు ఎక్కడికి ప్రవహిస్తుందో దానికే తెలియదు . అటువంటి నదులకు ఆనకట్ట కట్టి ఆ నీటిని ఒక నిర్దిష్టమైన రీతిలో ఉపయోగించుకున్నట్లైతే మనం దానిని వ్యవసాయానికి వాడవచ్చు . అదే నీటిని మరింత , కృషితో విద్యుత్తును కూడా పొందవచ్చు . అదే విధంగా అస్తవ్యస్తంగా ఉన్న నేటి విద్యార్థుల ఆలోచనా శక్తికి , స్వ - సంకల్పానికి శిక్షణ , నియమ నిభందనాలు అనే అడ్డుకట్ట వేసి , నీటి వంటి ఆలోచనా శక్తిని విద్య , కళ , సాహిత్యం మొదలగు రంగల మీదకు మల్లించినట్లైతే అలవోకగా చరిత్రలను సృష్టింటవచ్చు .

ఒక పాఠశాలలోని తరగతి గదిలో చాలామంది విద్యార్థులున్నారు. వాళ్లందరికీ ఒకే సిలబస్. పాఠాలు చెప్పే టీచర్ల బృందమూ ఒకటే. చదవడానికి వారందరికీ ఉన్న సమయమూ ఒకటే. కానీ, వార్షిక పరీక్షల్లో అందరికీ మార్కులు ఒకేలా రాలేదు. నలుగురైదుగురు రాష్ట్రంలోనే టాపర్లుగా నిలిచారు. మరికొందరు మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. కొందరేమో అత్తెసరు మార్కులతో బయటపడ్డారు. ఒకరిద్దరు పరీక్షల్లో తప్పారు కూడా.. ఎందుకు ఈ తేడా?దీనికి చాలా కారణాలను చెప్పవచ్చు. విద్యార్థి సామర్థ్యం, చదువుపట్ల అతడి వైఖరి, ఇంటివద్ద చదివే వాతావరణం, తల్లిదండ్రుల తీరు.. ఇలా ఎన్నెన్నో.. కానీ, అన్నిటికంటే ముఖ్యమైందీ, మార్కుల సాధనలో కీలకమైన పాత్ర పోషించేదీ ఒకటుంది. అదే.. నైపుణ్యం. చదివే నైపుణ్యం, పరీక్ష బాగా రాయగల నైపుణ్యం విద్యార్థి విజయానికి బాటలు వేస్తాయి. ఈ నైపుణ్యాలను నేర్చుకోవాలంటే అతడు కొన్ని లక్షణాలను అలవరచుకోవాలి. మార్కుల సాధనకు అనువైన నైపుణ్యాలనే విద్యానైపుణ్యాలు అనవచ్చు. విద్యానైపుణ్యాలను పుణికిపుచ్చుకుంటే ఆ విద్యార్థికి ఇక తిరుగు ఉండదు. రోజంతా కష్టపడి చదవడం ఒక ఎత్త్తెతే, చదివినదాన్ని పరీక్షల్లో ప్రదర్శించడం ఒక ఎత్తు. దీనికి కావలసింది మంచి చేతిరాత, జ్ఞాపకశక్తి, ఆకట్టుకునేలా చక్కటి శీర్షికలతో కూడిన జవాబులు, వీటన్నిటినీ సాధించడానికి అవసరమైన సానుకూల దృక్పథం తదితర నైపుణ్యాలు. విద్యానైపుణ్యాలేవి? వాటిని సాధించడం ఎలా? నైపుణ్యాల సాధనకు విద్యార్థికి ఉండవలసిన లక్షణాలేవి? విద్యార్థి జీవితంలో ఎదురయ్యే పలు రకాల సమస్యలను ఎదుర్కోవడం ఎలా? పరీక్షలు రాసేందుకు అవసరమైన మెళకువలేమిటి? ఇలాంటి ఎన్నెన్నో ప్రశ్నలకు విద్యార్థికి సమాధానం దొరికితే మార్కుల సాధనలో ముందు నిలిచి కెరీర్‌ని తీర్చిదిద్దుకొండి. పాఠశాలలో చేరినప్పటి నుంచే విద్యార్థికి పరీక్షలు తప్పనిసరవుతాయి. పదో తరగతి నుంచి పరీక్షలకు పూర్తి స్థాయి శక్తియుక్తులను ఉపయోగించి చదవాల్సి ఉంటుంది. దాదాపు 30 నుంచి 35 ఏళ్ల వయసు వరకూ ప్రభుత్వోద్యోగాల పోటీ పరీక్షలకు సిద్ధం కావలసి ఉంటుంది. సామాన్యుల జీవితంలో అభివృద్ధి, పరువూ, ప్రతిష్ఠ పరీక్షలతో వాటి ఫలితాలతో ముడిపడి ఉంటుంది. పరీక్షల్లో విజయం మన జీవిత గమనాన్ని సఫీగా, తక్కువ ఒడిదుడుకులతో కొనసాగేలా చేస్తుంది. మంచి మార్కులూ, ర్యాకులూ తెచ్చుకుంటే మరింత సులువుగా, త్వరగా మన జీవిత లక్ష్యాలను సాధించగలుగుతామనడంలో సందేహం లేదు. ప్రస్తుత వ్యాసాల్లోని అంశాలు పదో తరగతి నుంచి సివిల్స్ వరకూ అన్ని పరీక్షలకూ సరిపోతాయి. ఉపాధ్యాయులు, మానసిక శాస్త్ర నిపుణులూ కలిసి క్రోడీకరించిన ఈ సూచనలను సైకాలజిస్ట్ డాక్టర్ టి.ఎస్. రావు కలంద్వారా మనకు అందిస్తున్నారు. చాలా సూచనలను విద్యార్థుల వ్యక్తిగత పరిస్థితులకు అనుగుణంగా మార్పుచేర్పులు చేసుకొని అన్వయించుకోవాలి. ఈ సూచనలు విజయానికి దగ్గరదారులు (షార్ట్ కట్స్) కావు. మీరు విజయం సాధించడానికి కావాల్సిన ఆలోచనాత్మక పునాదిని అందించేవి. పట్టుదలతో, సహనంతో ఇందులోని సూచనలను ఆచరించి మీ విజయసౌధం మీరే నిర్మించుకోవాలి. విశ్వాసంతో ముందడుగు వేయండి.


వివరణ

[మార్చు]

రోజురోజుకీ సమాజంలో జరుగుతున్న మార్పులు . త్వరత్వరగా వస్తున్న సాంసృతిక , సామాజిక మార్పులు మనం భరించలేని మోతాదులో ఉంటున్నాయి . క్రమశిక్షణ కోసం తల్లిదండ్రులు కొంత కఠినంగావ్యవహరించడం అవసరమే , ఆయితే దానిని పగ సాధింపు చర్యగా భావించి పిల్లలు తల్లిదండ్రుల్ని తూలనాడడం , అవమానించడం అమానుషం . వృద్ధులను గౌరవించే మన సంస్కృతి రాను రాను సనుమరుగైపోతుంది . శ్రీరాముడు , శ్రావణుడు చరిత్రను కట్టుకథలుగా కొట్టిపారేస్తుంది . నేఇ యువతరం దీనికి కారణం టీ.వి.లు , సినిమాలు అని చెప్పకతప్పదు .

మన చుట్టు ఉన్న సమాజాన్ని మించిన పాఠశాల మరొకటి లేదు . ఈ సమాజంలో నేర్పే వాళ్ళున్నారు . ప్రయోగశాలలున్నాయి . ఎటొచ్చి పాఠశాలలో మంచి మాత్రమే నేర్పుతారు . మన్చి ప్రయోగాలే చేయిస్తారు . సమాజంలో మంచి చెడూ రెండూ ఉంటాయి .ఆ మంచిచెడులను విజ్ఞానం నేర్పుతుంది .


ముగింపు

[మార్చు]

చదువు అంటే కేవలం పాఠ్యపుస్తక పఠనమే కాక మానవసంబంధాల సున్నితత్వాన్ని అర్థంచేసుకొని చదువుకుంటూ తల్లిదండ్రులకు చేదోడు - వాదోడుగా ఉండటమే . ఇంటి పనులు చేసుకోవడం చిన్నతనంగా భావిస్తే , అది విద్యాభ్యాసంలో లోపమే .

ర్యాంకు ముఖ్యమా ? నాలెడ్జ్ ముఖ్యమా ? అనే ప్రశ్న ఏ విద్యార్థిలోనూ కలగే ఆస్కారం లేకుండా మన విద్యావిధానాన్ని సమస్థితిలో ఉంచేందుకు ప్రతిఒక్కరు వారి బాధ్యాతను నిర్వర్తిస్తారని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను .

దస్త్రం:Bal.jpeg