వాడుకరి:PrasadP007/ప్రయోగశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మెహులి ఘోష్

మెహులి ఘోష్ భారత వర్ధమాన షూటర్. 16 ఏళ్ల వయసులో 2016 జాతీయ షూటింగ్ చాంపియన్ షిప్‌లో తొమ్మిది పతకాలు గెలిచి చరిత్ర లిఖించారు ఘోష్. 2017 జపాన్‌లో జరిగిన ఏషియన్ ఎయిర్ గన్ చాంపియన్ షిప్‌లో స్వర్ణం సాధించి అంతర్జాతీయ స్థాయిలో మొదటి పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నారామె. [1] పశ్చిమ బెంగాల్‌లో జన్మించిన ఘోష్ భారత షూటింగ్ బృందంలో అత్యంత పిన్నవయస్కురాలు.

PrasadP007/ప్రయోగశాల
వ్యక్తిగత సమాచారం
జన్మనామంమెహులి ఘోష్
పౌరసత్వంభారతీయం
జననం20 నవంబర్ 2000
కల్యాణి, నాడియా, పశ్చమ బెంగాల్ క్రీడ: షూటింగ్
క్రీడ
క్రీడషూటింగ్

వ్యక్తిగత జీవితం మరియు నేపథ్యం

ప్రముఖ టీవీ సీరియల్ సీఐడీ, మరికొన్ని యాక్షన్ మూవీస్ చూసి గన్స్, బుల్లెట్లపై ఆసక్తి పెంచుకున్నారు ఘోష్. 2008 ఒలంపిక్స్ లో భారత షూటర్ అభినవ్ బింద్రా స్వర్ణం సాధించడాన్ని స్ఫూర్తిగా తీసుకుని షూటింగ్‌ను తన కెరీర్ గా ఎంచుకోవాలని ఘోష్ నిర్ణయించుకున్నారు. ఘోష్ కెరీర్ ను ప్రారంభించిన సమయంలో ప్రాక్టీస్ చేసేందుకు సరైన వసతులు ఉండేవి కావు. అంతే కాదు ఎలక్ట్రానిక్ టార్గెట్లు కూడా ఉండేవి కావు. తన లక్ష్యాలను మార్చుకునేందుకు చేతితో లాగే సాధనాలను ఉపయోగించేవారు ఘోష్.

ఘోష్ మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి రోజువారి కార్మికుడు కాగా, తల్లి గృహిణి. ఆరంభంలో ఘోష్‌కు శిక్షణ ఇప్పించేందుకు చాలా ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ, ఆ తర్వాత ఆమెకు ఖరీదైన శిక్షణ ఇప్పించగలిగారు. (2)[2]

2014లో ఘోష్ అనుకోని ప్రమాదంలో ఇరుక్కున్నారు. ప్రాక్టీస్ లో భాగంగా ఆమె పిస్టల్ నుంచి వెలువడిన ఓ పెల్లెట్ ఓ వ్యక్తిని గాయపర్చింది. ఈ ఘటన ఆమె జీవితాన్ని మార్చింది. ఘోష్ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. అప్పుడు అర్జున అవార్డీ గ్రహీత జోయ్ దీప్ కర్మాకర్ షూటింగ్ అకాడమీలో ఘోష్‌ను చేర్పించారు ఆమె తల్లిదండ్రులు.[3]ఆమె నివసిస్తున్న ప్రదేశం నుంచి చాలా దూరం ప్రయాణించి, శిక్షణ పూర్తి చేసుకుని అర్ధరాత్రి ఇంటికి చేరేవారు ఘోష్. అయితే తన విజయానికి తల్లిదండ్రులు, కోచే కారణమని చెబుతుంటారు ఆమె. [3]

వృత్తిపరమైన విజయాలు

2016 జాతీయ చాంపియన్ షిప్ ఘోష్ కు పెద్ద చెప్పుకోదగ్గ టోర్నీ. అందులో తొమ్మిది పతకాలు సాధించడమే కాకుండా భారత జూనియర్ జట్టుకు కూడా ఎంపికయ్యారు. 2017లో ఆమె తన తొలి అంతర్జాతీయ పతకాన్ని గెలుచుకున్నారు. జపాన్‌లో జరిగిన ఏషియన్ ఎయిర్ గన్ చాంపియన్ షిప్‌లో ఆమె పతకం సాధించారు. 2018 బ్యూనస్ ఎయిర్‌లో జరిగిన యూత్ ఒలంపిక్స్‌లో పాల్గొనడమే కాకుండా రజత పతకాన్ని కూడా కైవసం చేసుకున్నారు. అదే ఏడాది కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం, వరల్డ్ కప్‌లో కాంస్యం సాధించారు. [4] అదే ఏడాది ఘోష్ సీనియర్ వరల్డ్ కప్‌లో అడుగుపెట్టారు. అంతేకాదు, 10 మీటర్ల మహిళల ఎయిర్ రైఫిల్ విభాగంలో అత్యుత్తమ స్కోరు సాధించి కాంస్యం గెలుచుకోవడమే కాకుండా, వరల్డ్ జూనియర్ రికార్డు స్కోరును నమోదు చేశారు. నేపాల్‌లో జరిగిన 2019 సౌత్ ఏషియా గేమ్స్‌లో ప్రస్తుత వరల్డ్ రికార్డు కంటే అత్యుత్తమ స్కోరు నమోదు చేసి స్వర్ణం పతకం కైవసం చేసుకున్నారు.[5] ఘోష్ అత్యుత్తమ ప్రదర్శనకు గాను స్పోర్ట్స్ స్టార్ ఏసెస్ అవార్డు 2020లో ‘‘ఫిమేల్ యంగ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్’’ అవార్డులను సొంతం చేసుకున్నారు. [6]

మూలాలు

[మార్చు]
  1. "issf sports".{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "bbc telugu article".{{cite web}}: CS1 maint: url-status (link)
  3. 3.0 3.1 "know your athlete mehuli ghosh".{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "mehuli ghosh wins silver".{{cite web}}: CS1 maint: url-status (link)
  5. "south asian games mehuli wins gold".{{cite web}}: CS1 maint: url-status (link)
  6. "mehuli-ghosh-wins-sportstar-aces-2020-female-young-athlete-of-the-year-shooting".{{cite web}}: CS1 maint: url-status (link)