వాడుకరి:Ramamohanchinta
శ్రీ శ్రీ
మహాకవి మరణించలేదు - నాహృదిలో ఉదయించినాడు
కూలివాని గుండెలొ ఆవేదన ఉందని
కార్మికుని కడుపులో ఆకలి రగిలందని
కలంపట్టి వ్రాసిన మాకవి మహాకవి శ్రీ శ్రీ
మహాకవి మరణించలేదు - నాహృదిలో ఉదయించినాడు
దోపిడిదారుల దురంతాలు సాగవని
పీడకుల పాలన మాకిక వద్దని
గళం ఎత్తిపాడిన మాకవి మహాకవి శ్రీ శ్రీ
మహాకవి మరణించలేదు - నాహృదిలో ఉదయించినాడు
దగాపడ్డ తమ్ములార ఏకంకండని
మోసపోక యికనైనా మేలుకొండని
మాకు పిలుపునిచ్చిన మాకవి మహాకవి శ్రీ శ్రీ
మహాకవి మరణించలేదు - నాహృదిలో ఉదయించినాడు
చల్లని తెలుగు వెన్నల వెలుగు అందాల వడుగు నా భావనమ్మ
సౌరభ సుమమాల కోమల విరిబాల సోభిల్లు తెలుగు సుమధుర రసాల నా భావనమ్మ
సంస్కృతము లేక తెలుగు లేదు
పారసికము వదల లేదు
ఆంగ్లము వల్ల మనుగడ లేదు
నా భావనమ్మ
తెలుగేది
వెలుగేది
తెలుగుజాతికి దారేది
నా భావనమ్మ
చేతిలో కప్పు ఇంటిపైకప్పు తెలుగేదొ చెప్పు నా భావనమ్మ
తెలుగు జల్లెడ జర చందమామ చర రంపము బండి ర లేదు నా భావనమ్మ
నేతలు మెచ్చు ఎఫ్ డి ఐ లు వచ్చు మధ్యతరగతికే చిచ్చు నా భావనమ్మ
వలసదేశము నాడు పాలించెను ఆంగ్లేయుడు నయావలస విధానమున నేడు పాలించు మనల ప్రపంచ బ్యాంక్ నా భావనమ్మ