Jump to content

వాడుకరి:Ravirangarao

వికీపీడియా నుండి

వ్యాసం పేరు "రావి రంగారావు కవిత్వం" (నుండి ఇక్కడికి కాపీ చేయబడింది).

పద్యం రాయటంలో, వచనకవిత రాయటంలో, మినీకవిత రాయటంలో, సాహిత్యవిమర్శ చేయడంలోనూ...రావి రంగారావుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సరళంగా ఉంటూనే ఆలోచించే కొద్దీ ఎంతో లోతైన భావాలు ఉండేలా రాయగలుగుతారు.

ఉదాహరణకు ఒక పద్యం.
మనసు సుమపేశలంబైన మానవునకు
పిచ్చివాడని లోకంబు పెరు పెట్టు,
కడు దృఢంబయ్యెనేని రాక్షసుడు,అసలు
మనసు లేనట్టి వాడెపో, మంచివాడు"
ఉదాహరణకు ఒక మినీకవిత.కవిత పేరు "గుడ్ మార్నింగ్".
ఆకాశం ఇచ్చింది
ఆకుల్ని,
చీకటి తెచ్చింది
వక్కల్ని,
వెన్నెల కలిపింది
సున్నం...
తాంబూలం వేసుకొంది
సముద్రం...
పొద్దున్నే పలకరించాడు
భానుడు నవ్వుతూ,
సముద్రమూ నవ్వింది
పండిన నోటితో..."