Jump to content

వాడుకరి:Rithwik Ponnam/ప్రయోగశాల

వికీపీడియా నుండి

కరాటే విద్య అంటే ఏమిటి?

[మార్చు]

కరాటే( Karate ) ఆత్మరక్షణ నైపుణ్యాలను నేర్పుతుంది.ఏవైనా ప్రమాదకర పరిస్థితులలో మనల్ని మనం కాపాడుకోవడానికి కరాటే మార్షల్ ఆర్ట్స్ ఉత్తమంగా నిలుస్తుంది.

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు . చిన్న విషయమైనా , అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

పూర్వం చదువుల్లో యుద్ద విద్యలు కూడా ఒక భాగంగా ఉండేవి. కేవలం టెక్స్ట్ బుక్కులను బట్టీ కొట్టడమే కాకుండా, శరీర ధారుఢ్యం పెంచుకోవడానికి, శత్రువు నుంచి కాపాడుకోవడానికి కూడా యుద్ద విద్యలు అక్కరకొచ్చేవి. కర్రసాము, కత్తిసాము, మల్లయుద్దము, విలువిద్య... ఇవన్నీ మన యుద్దవిద్యలు, అయితే కాలక్రమంలో ఈ 'కరాటే' విద్య మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది. నిరాయుధంగా శత్రువు ఎదిరించడంలో కరాటే మించింది లేదు. 'కరాటే' అనే మాటకు అర్థమే 'ఖాళీ చేతులు' అని అర్థం.

జపాన్ దేశంలో పుట్టి చైనాలో విస్తృతంగా అభివృద్ధి చెందిన ఈ యుద్ధ విద్యను మొదటగా సాధన చేసింది బౌద్ధభిక్షవులు అహింసను ఆచరించే ఈ భిక్షవులు, బౌద్ధ ప్రచారం కోసం అడవుల్లో ప్రయాణించే సమయాన దొంగలను ఎదిరించడానికి ఈ యుద్ధకళను నేర్చుకున్నారు. కరాటేలో అనేక స్టయిల్స్ ఉన్నాయి. ఒక్కో ‌స్టయిల్‌కు ఒక్కో విధమైన సాధన అవసరం. అలాగే కరాటే వీరులకు ర్యాంకులు ఉంటాయి. ఒక్కో ర్యాంకును ఒక్కో బెల్టుతో సూచిస్తాయి. ప్రాథమిక స్థాయిలో వైట్ బెల్ట్, ద్వితీయ స్థాయిలో బ్రౌన్ బెల్ట్, సర్వోన్నత స్థాయిలో బ్లాక్ బెల్ట్ ఇస్తారు. బ్లాక్ బెల్ట్ నడుముకు చుట్టుకొని గోదాలో దిగాడంటే అతడు మాస్టర్ కింద లెక్క.

కరాటేలో జగమంతా తెలిసిన వీరుడు బ్రూస్-లీ. చైనాలో జన్మించిన బ్రూస్-లీ ఖాళీ చేతులతో ముప్పై, నలభై మందిని సులభంగా మట్టి కరిపించే సత్తా కలిగి ఉండేవాడు. ఆయన నటించిన 'ఎంటర్ ది డ్రాగన్' సినిమా ఇప్పటికీ టీవీలో ఆబాలగోపాలాన్ని అలరిస్తుంది. కుంగ్‌ఫూ వంటి మార్షల్ ఆర్ట్స్ ప్రాచుర్యం కలిగించిన వ్యక్తి జాకీ చాన్. మనుషుల్లో తొంభై శాతం మంచివాళ్ళే ఉన్నా పది శాతం దుష్టులు, దుర్మార్గులు ఉంటారు. ఎదుటివాళ్ళకు హాని చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అటుమంటి వాళ్ళకు బుద్ది చెప్పాలంటే మనల్ని మనం కాపాడుకోవాలంటే కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ఉత్తమం. చిన్నప్పటి నుండి కరాటే నేర్చుకుంటే సులభంగా వంటపడుతుందని అంటారు. మన రాష్ట్రంలో అనేక ముఖ్యపట్టణాల్లో కరాటే అకాడెమీలు ఉన్నాయి.