వాడుకరి:Roy.d/ప్రయోగశాల/సిప్పొరా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Zipporah
Detail from Moses Leaving to Egypt by Pietro Perugino, c. 1482. Zipporah is in blue.
జీవిత భాగస్వామిMoses
పిల్లలుGershom
Eliezer
బంధువులుAaron (brother-in-law)
Miriam (sister-in-law)

కుటుంబం, తల్లిదండ్రులు[మార్చు]

సిప్పొరా అనగా పిచుక అనిఅర్ధం.ఈమె ఇస్రాయేలు విమోచకుడు ధర్మశాస్త్ర ప్రదాతయైన మోషేకి భార్య. అంతటి వాడికి భార్యయైనా ఆమెకు బైబుల్లో అంత ప్రశస్తి లేదు. ఈమె తండ్రి మిద్యానీయులకు యాజకుడైన యిత్రో. ఏడురు కుమార్తెలలో ఈమె నొకతె. ఇతనికి రగూవేలు అనే పేరు కూడా వుంది.

మోషేతో వివాహం[మార్చు]

ఒకరోజు సిప్పొరా తన చెల్లెళ్లతో కలసి బావి వద్ద గొర్రెలకు నీళ్ళుతోడి పోస్తుంది. ఆ సమయంలో కొందరు అన్య జాతికాపరులు ఆమెను బెదిరించి తరిమి వేశారు. అప్పుడే ఈజిప్టు నుండి పారపోయి వచ్చిన మోషే సిప్పొరాని కాపాడాడు.సిప్పొరా తండ్రి యిత్రో తన కుమార్తెను కాపాడినందుకు కృతజ్ఞగా తన కుమార్తెను మోషేకి ఇచ్చి వివాహం చెసినాడు.

సంతానం[మార్చు]

మోషే, సిప్పొరా దంపతులకు ఇద్దరు కుమారులు జన్మించినారు. వారు; గెర్షోము మరియు యేలియసేరు.

భర్తను కాపాడడం[మార్చు]

సిప్పొరా తన భర్తను ఒకానొక సమయంలో మోషేను కాపాడినది. బానిసలైన తన ప్రజలను కాపాడ్డానికి మోషే ఈజిప్టుకి తిరిగి వస్తుండగా త్రొవలో ఒకచోట విడిది చేశాడు. మోషేను ప్రభువు అతన్ని అక్కడ చంపగోరాడు. ఎందుకు? బహుశ మోషే అతని కొమారులు సున్నతి పొందలేదు కనుక. సిప్పొరా ఈ సంగతిని గ్రహించి పదునైన రాతిని తీసికొని కుమారునికి సున్నతి చేసింది. నెత్తురుతో కూడిన ఆ రాతిని మోషే కాళ్లకు తాకించి నీవు నాకు నెత్తురు పొత్తుకల పెనిమిటివి అని అరిచింది. అందువలన మోషేకు కూడ సాంకేతికంగా సున్నతి చేసినట్లయింది. కనుక అతడు బ్రతికిపోయాడు. ఈ సంఘటనలో సిప్పొరాయే మోషేను కాపాడింది. అటుపిమ్మట ఆమె ఈజిప్టుకు వెళ్లక మిద్యాను దేశానికి తిరిగిపోయింది.

మత నమ్మకాలు[మార్చు]

మోషే యావే భక్తుడు. సిప్పొరా మిద్యానీయులు కొలిచే అన్యజాతి దేవుళ్లను పూజించేది. బహుశ మత విషయాన్ని పురస్కరించుకొని వారికి మనస్సులు కలిసి వుండకపోవచ్చు. మోషే యిస్రాయేలు ప్రజలకు సంపాదించి పెట్టిన విమోచనంలో ఆమె పాలు పంచుకోలేదు.

ప్రశస్తి[మార్చు]

మోషే యిస్రాయేలు ప్రజలను ఫరోదాస్యంనుండి విడిపించి ఎడారిగుండా కనాను దేశానికి తీసికొనిపోతున్నాడు. దారిలో యిత్రో కూతురుని మనుమలను తోడ్కోనివచ్చి మోషేకు అప్పగించాడు. కాని ఆమె మోషేతో కనాను దేశానికి వెళ్లినట్లుగా కనిపించదు. ఆ విూదట ఆమె ఏమైందో బైబులు చెప్పదు.

మూలాలు[మార్చు]

  • బైబుల్లో స్త్రీలు:ఫాదర్ పూదోట జోజయ్య