Jump to content

వాడుకరి:Sangam.sravani/ప్రయోగశాల

వికీపీడియా నుండి

స్లోమోషన్ కెమేరా

            హెచ్.జి.వెల్స్ అను రచయిత స్లోమోషను కెమేర సాధ్యం కాదని తన కథను వెలువరించారు. ఆ కథ రాసే నాటికి అలాంటిది తన కళ్ళారా చూస్తానని అనుకొని ఉండలేదు. అయితే స్లోమోషను కెమేరా ధర్మమా అంటూ ఆయన తాను ఊహించిన దానిని ప్రత్యక్షంగా చూశాడు. 
 మామూలు సినిమా కెమేరాలు సెకండు 24 బొమ్మలు తీస్తే,ఈ కెమేరా దానిని చాల రెట్లు తీస్తుంది.దీనిన పైన తీసిన ఫిల్మును మామూలు వేగంతో సెకండుకు 24ఫ్రేముల చొప్పున,తెరమీద ప్రోజెక్టు చేస్తే కదలికలు మామూలుగా ఉండే దానికన్న చాలా నింపాదిగా కనిపిస్తాయి.అసాధారణంగా తాపీగా ఉండే గంతులు,మిగిలిన తాపీగా పడిన విషయాలు తెరమీద పాఠకులు చూసే ఉంటారు.స్లోమోషను కెమేరాలు హెచ్చు అభివృద్ధి కావడంవల్ల హెచ్.జి.వెల్స్ చిత్రించిన విడ్డూరాలు దాదాపు ప్రత్యక్షమవుతున్నాయి.
స్లోమోషన్ కెమేర


భూమిలోపలి ఋతువులు

[మార్చు]
 భూమి లోపల,భూతలమునకు దిగువన 10 అడుగుల లోతున ఉండే ఋతువులు ఒకటే ఉండవు.దానికి కారణం నేల మంచి ఉష్ణవాహకం కాదు.లెనింగ్రాడ్లో విపరీతంగా మంచు పడుతున్నప్పుడు కూడా నీరు గడ్డకట్టి నీటి గొట్టాలు బద్దలు కావు.అవి 2 మీటర్ల లోతున ఉంటాయి.నేలకు పై భాగాన కలిగే శీతోష్ణపు మార్పులు దిగువన ఉండే వేరువేరు పొరలకు అందడంలో చాలా జాప్యం జరుగుతుంది.లెనిన్ గ్రాడ్ మండలంలోని స్లూత్స్క్ పట్టణంలో పరీక్షించినమీదట తెలిసినదేమిటంటే,మూడు మీటర్ల లోతున అత్యధిక ఉష్ణం 76 రోజులు ఆలస్యంగాను,అత్యధిక శీతలం 108 రోజులు ఆలస్యంగాను వస్తుంది.నేలపైన అత్యధిక ఉష్ణం జులై 25న కలిగితే,నేలకు మూడు మీటర్ల అడుగున అత్యుష్ణదినం అక్టోబర్ 9,అతి శీతలదినం నేలపై జనవరి 15 అయితే,అదే లోతున అతి శీతల దినం మే నెలదాక రాదు.ఇంకా లోతుకుపొతే ఈ రోజులు మరింత ఆలస్యంగా వస్తాయి.
  లోతుకు వెళ్ళిన కొలదీ ఉష్ణస్థితిలో కలిగే మార్పులు సన్నగిల్లుతూ,ఒక లోతుకు వెళ్ళేసరికి ఉష్ణస్థితిలో మార్పే ఉండదు.ఇక్కడ శతాబ్దాల తరబడి ఒకే ఉష్ణోగ్రత ఉంటుంది.
  ఆ విధంగా భూమిపైన మనకుండే ఋతువులు ఎన్నడు భూమిలోపల ఉండవు.మనకు శిశిర ఋతువైనప్పుడు మూడు మీటర్ల దిగువన శరత్ కాలం ఉంటుంది.ఇలా ఋతువులు వేరువేరుగా ఉంటాయి. 

గతిశక్తి సంచయము(అక్యూములేటరు) శీర్షిక పాఠ్యం

[మార్చు]
 "శాశ్వత చలన"యంత్రాలను సరిగా పరిశీలించనివారు ఎలాంటి పొరపాట్లకు గురిఅవుతారో ఉఫీంత్సెవ్ తయారుచేసిన

"గతిశక్తి సంచాయము (అక్యూములేటర్ ఆఫ్ కైనటిక్ ఎనర్జి)"అనబడే యంత్రం నిరూపించింది.