వాడుకరి:Srilakshmi chintapalli/ప్రయోగశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సమత్వరణంలో ఉన్న వస్తువుల చలనానికి సంబంధించి v = u + at;  v2-u2 = 2as; s = ut +  at2 సమీకరణాలను ఉపయోగిస్తారు. ఒక వస్తువును నిట్టనిలువుగా భూతలం నుంచి పైకి విసిరితే, దాని చలనం భూమి గురుత్వాకర్షణ బలానికి వ్యతిరేకంగా ఉంటుంది. దాంతో గురుత్వత్వరణం (g) రుణాత్మకం అవుతుంది. అందుకే వస్తువు వేగం క్రమేపీ తగ్గుతూ వస్తుంది. ఒకానొక ఎత్తు వద్ద సున్నా అవుతుంది. ఈ వస్తువు చలన సమీకరణాలు రాయడానికి 'a' బదులు -g, 's' బదులు 'h' రాయాలి. కాబట్టి, చలన సమీకరణాలు, v = u - gt; v2 - u2 = -2gh; h = ut -  gt2    అవుతాయి. 
          ఏ బాహ్యబలాలు పనిచేయకుండా, కేవలం భూమి గురుత్వాకర్షణ బలం వల్లే వస్తువు పైనుంచి కిందికి పడుతూ ఉంటే ఆ వస్తువును స్వేచ్ఛా పతన వస్తువు అంటారు. ఇది భూ ఆకర్షణ బలం పనిచేసే దిశలోనే చలిస్తుంది. కాబట్టి దానికి ఉన్న ధన త్వరణం వల్ల వస్తువు వేగం క్రమేపీ పెరుగుతూ ఉంటుంది. స్వేచ్ఛా పతన వస్తువు తొలివేగం u సున్నా అవుతుంది. అందుకే 'u' బదులు '0', 'a' బదులు +g, 's' బదులు 'h'లను చలన సమీకరణాల్లో ఉపయోగిస్తే v = gt;

v2 = 2gh; h = gt2 అవుతాయి.

          భూతలం నుంచి పైకి విసిరిన వస్తువు వేగం ఏ ఎత్తు వద్ద సున్నా అవుతుందో ఆ ఎత్తును వస్తువు చేరుకునే గరిష్ఠ ఎత్తు అంటారు. తొలివేగం 'u'తో పైకి విసిరిన వస్తువు చేరుకునే గరిష్ఠ ఎత్తు (h) = u2/2g అవుతుంది. కాబట్టి, గరిష్ఠ ఎత్తు, తొలివేగం వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది.