వాడుకరి:Srividya~tewiki

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కాలం కొవ్వొత్తిలా కరుగుతూ జ్ఞాపకాల వెలుగు పూలను విరబూయిస్తూనే ఉంటుంది! వెనక్కి తిరిగి చూసుకుంటే గదిచిన బడిప్రయాణపు పిల్లగాలి చల్లగా పలకరిస్తుది!! బాల్యం బాగున్నావా అని ఆప్యాయంగా అదుగుతుంది!!!

బడి గంటకు భయపడి పరిగె త్తింది జ్ఞాపకమే! బడిని వీడిన చివరిరోజు రాలిన కన్నీరు జ్ఞాపకమే!1

మామిడి పండుకై హెడ్ మాస్టర్ తిట్టినప్పుడు మార్కుల కోసం, ర్రాంకుల కోసం తపన పడినప్పుడు

            ఆ బాధ జ్ఞాపకం!          
       ఆ అనందమూ జ్ఞాపకం! 

అల్లరి నిండిన ఆ చల్లని రోజులు స్తబ్ధత కొలువైన నేడుని వెక్కిరిస్తున్నట్టు, ఆశతొనిందిన ఆ చిన్నరి కళ్ళు యాంత్రికమైపొయిన నన్ను చూసి ప్రశ్నిస్తున్నట్టు, అపుడు తెలియని ఆ అనందం ఇపుడు గుర్తుకొచి గుండె బరువెక్కినట్టు, ఏదొ బధ, ఏదొ ఆనందం !!!

నా జ్ఞాపకాలలో కొలువున్న మీకు క్రుతజ్ఞతాకుసుమాలను సమర్పించి ఉడుతభక్తిని చటుకోవాలని నా ఈ చిన్నప్రయత్నం !!!