Jump to content

వాడుకరి:Vamsiglobal/ప్రయోగశాల

వికీపీడియా నుండి

మణికొండ వేదకుమార్‌ (manikonda Vedakumar) ప్రముఖ విద్యావేత్త, పర్యావరణవేత్త, ఇంజినీర్‌ అయిన మణికొండ వేదకుమార్‌ తెలంగాణలో సొంత గ్రామమైన మెదక్‌ జిల్లా ప్రజ్ఞాపూర్‌లో తన ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. మైసూర్‌ యూనివర్సిటీ నుంచి సివిల్‌ ఇంజినీర్‌ పట్టా పొందారు. హైదరాబాద్‌ లోని జేఎన్‌టీయూ నుంచి మాస్టర్‌ ఆఫ్‌ అర్బన్‌ అండ్‌ రీజనల్‌ ప్లానింగ్‌ (ఎంయూఆర్‌పీ) డిగ్రీ పొందారు.

బాలల కోసం…

     పర్యావరణవేత్త, విద్యావేత్తగా సుస్థిరదాయక, జీవించగలిగిన నగరాలపై పని చేస్తూనే, చెలిమి ఫౌండేషన్‌ తరఫున ఆయన బాలసాహిత్యంపై పరిశోధన చేశారు. ఎన్నో పుస్తకాలను ప్రచురించారు. చిల్డ్రన్‌ ఫిల్మ్‌ సొసైటీ, ఏపీ (సీఎఫ్‌ఎస్‌ఏపీ) చైర్మన్‌గా ఆయన 1992 నుంచి ఏడు హైదరాబాద్‌ చి్డన్‌ ఫెస్టివల్స్ను నిర్వహించారు. ఏపీఎస్‌ఎఫ్‌టివి మరియు టీడీసీతో కసి 2002 మరియు 2004లో మొదటి మరియు రెండో ఆసియన్‌ చిల్డ్రన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌ను నిర్వహించారు. ఇంటర్నేషనల్‌ చిల్డ్రన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (ఐసీ ఎఫ్‌ఎఫ్‌)ను 1995లో హైదరాబాద్‌  తీసుకువచ్చేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం మరియు చిల్డ్రన్‌ ఫిల్మ్‌ సొసైటీ (ఇండియా)తో చర్చిస్తూ అందులో ఎంతో కీకపాత్ర పోషించారు. తదనంతరం 1997 నుంచి ఐసీఎఫ్‌ఎఫ్‌ కు హైదరాబాద్‌ శాశ్వత వేదికగా మారింది.

ఫోరమ్‌ ఫర్‌ ఎ బెటర్‌ హైదరాబాద్‌…

     ఫోరమ్‌ ఫర్‌ ఎ బెటర్‌ హైదరాబాద్‌కు ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు. ఇన్‌టాక్‌  రాష్ట్ర శాఖలో కీలకహోదాలో ఉన్నారు. మూడు దశాబ్దాలు గా హైదరాబాద్‌ బిల్ట్‌ హెరిటేజ్‌ పై మరియు మూసీనది పరిరక్షణపై అధ్యయనం చేస్తూ  హైదరాబాద్‌ బిల్ట్‌ హెరిటేజ్‌ ఇన్వెంటోరైజేషన్‌ సిద్ధం చేశారు. హైదరాబాద్‌ హెరిటేజ్‌  లిస్టింగ్‌ ప్రాజక్ట్ కు ఆయన సారథ్యం వహించి 1486 హెచ్‌బీఎస్‌ను గుర్తించారు. టాంజిబుల్‌ మరియు ఇన్‌టాంజిబుల్‌ హెరిటేజ్‌కు సంబంధించి ఎన్నో కార్యక్రమాలను నిర్వహించారు. పాఠశా, కాలేజీ స్థాయిల్లో హెరి టేజ్‌ క్లబ్‌ను ఏర్పాటు చేయడంలో కీకపాత్ర పోషించారు. 

సినిమారంగంలో….

     ప్రఖ్యాత సినీ దర్శకుడు, నిర్మాత   బి.నర్సింగ్‌రావుతో కలసి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా, ఇతరత్రాగా మా భూమి (తెలుగు ఫీచర్‌ ఫిల్మ్‌ ` 1978), రంగుల కల (తెలుగు ఫీచర్‌ఫిల్మ్‌ ` 1984), మట్టి మనుషులు (తెలుగు ఫీచర్‌ ఫిల్మ్‌ ` 1991), దాసి (తెలుగు ఫీచర్‌ ఫిల్మ్‌ `1989` ఐదు జాతీయ అవార్డును గెలుచుకున్న ఈ తరహాలోని మొట్ట మొదటి సినిమా)తో అనుబంధాన్ని కలిగి ఉన్నారు. మట్టి మనుషు తెలుగు సినిమాకు గాను నాటి రాష్ట్రపతి   ఆర్‌.వెంకట్రామన్‌ నుంచి 1991లో జాతీయఅవార్డును పొందారు. ఇదే గాకుండా మరో మూడు జాతీయ అవార్డును కూడా పొందారు. ‘ది సిటీ’ (హైదరాబాద్‌), స్పెషల్‌ జ్యూరీ నేషనల్‌ అవార్డు (ఆంత్రోపోలాజికల్‌ ఫిల్మ్‌ మరియు బెస్ట్‌ ఎత్నోగ్రాఫిక్‌) పొందిన ‘మన ఊరు’ (ది విలేజ్‌), ఆకృతి (1991) వంటి డాక్యుమెంటరీల నిర్మాణంతో కూడా ఆయన అనుబంధాన్ని కలిగి ఉండడం చిత్ర నిర్మాణంపై ఆయనకు గల దాహార్తిని చాటుతుంది.

మట్టి మనుషులు (ఫీచర్‌ ఫిల్మ్‌) సహనిర్మాతగా ఆయన ఆ సినిమా దర్శకుడు నర్సింగ్‌ రావుతో కలసి మాస్కో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు ఆహ్వానం అందుకున్నారు. భారత్‌ నుంచి ఈ సినిమా కాంపిటీషన్‌లో ఉంది. కాంపి టీషన్‌ విభాగానికి ఎంపికైన ఏకైక సినిమా ఇదే. భారతీయ సినీరంగ ప్రముఖు, లిజెండరీ ఫిల్మ్‌ మేకర్‌ అయిన డాక్టర్‌ డి.రామానాయుడు నిర్మాణసారథ్యంలో, బి.నర్సింగ్‌రావు దర్శకత్వంలో 2003లో రూపొందిన తెలుగు ఫీచర్‌ ఫిల్మ్‌ ‘హరిమ్లి’ (ది రెయిన్‌బో), 2004లో బంగ్లా దేశ్‌ ప్రభుత్వంతో కలసి రెయిన్‌బో ఫిల్మ్‌ సొసైటీ (ఢాకా) నిర్వహించిన 8వ ఢాకా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో బెస్ట్‌ జువైనల్‌ ఆడియెన్స్‌ అవార్డును పొందింది. ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ కాంపిటీటివ్‌ విభాగాని కి యావత్‌ దక్షిణాసియా నుంచి ఎంపికైన సినిమా ఇదొక్కటే. చిల్డ్రన్‌ ఫిల్మ్‌ సొసైటీ (ఏపీ) చైర్మన్‌, హరిమ్లి సినిమా నిర్మాణబృందంలో చురుకైన సభ్యుడైన యం. వేదకుమార్‌ ఈ ఫెస్టివల్‌కు హాజరయ్యారు. విద్యార్థులు, యువతీయువకులు, నిర్మాతలు, దర్శకులు, విమర్శకులు... ఇలా ప్రేక్షకు ల్లోని అన్ని వర్గాల వారి నుంచి కూడా ఆయన ప్రశంసలను అందుకున్నారు. చిల్డ్రన్‌ ఫిలిం సొసైటీ ఆఫ్‌ ఇండియా, ఏపీఎస్‌ఎఫ్‌డీసీతో కసి సిఎఫ్‌ఎస్‌ తరఫున, ఫిల్మ్‌ ఫెస్టివల్స్ లో ఓపెన్‌ ఫోరమ్‌ విధానాన్ని ప్రవేశపెట్టడంలో ఆయన కీలక పాత్ర వహించారు. దీనికి అన్ని వర్గాల నుంచీ ప్రశంసలు ల భించాయి. గతంలో జరిగిన ఇంటర్నేషనల్‌ చిల్డ్రన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్స్ లో ఫిల్మ్‌ మేకింగ్‌, పప్పెట్రీ, థియేటర్‌ వర్క్షాప్‌ను ఏర్పాటు చేయడంలో మరియు చిల్డ్రన్‌ ఫిల్మ్‌ మూవ్‌మెంట్‌ను భారతదేశానికి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు.

దిగువ పేర్కొన్న ఇంటర్నేషనల్‌ చిల్డ్రన్‌ ఫెస్లివల్స్ కు ఆయన జ్యూరీ స్పెషల్‌ ఇన్వైటీగా హాజరయ్యారు. ` మట్టిమనుషులు (ఫీచర్‌ ఫిల్మ్‌) సహనిర్మాతగా మాస్కో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (1991)కు ఆ హ్వానం. కాంపిటీషన్‌ విభాగంలో ప్రదర్శించ బడినది. భారత్‌ నుంచి ఈ విభాగానికి ఎంపికైన ఏకైక చిత్రం ఇదే. `ఇరాన్‌లోని హహెదాన్‌లో ఫరాబి సినిమా ఫౌండేషన్‌ 2009లో నిర్వహించిన 23వ ఐసీఎఫ్‌ఎఫ్‌కు ఇంటర్నేషనల్‌ జ్యూరీ మెంబర్‌ ` 2007లో ఇరాన్‌లోని టెహ్రాన్‌లో జరిగిన 37వ రోష్డ్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఇంటర్నేషనల్‌ జ్యూరీ మెంబర్‌ ` అర్మేనియాలోని యెరెవాన్‌లో 2007లో జరిగిన 3వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఫర్‌ చి్డన్‌ అండ్‌ యంగ్‌ పీపుల్‌కు ఇంటర్నేషనల్‌ జ్యూరీ మెంబర్‌ ` చదువు మరియు మీడియా మధ్య సంబంధంపై పత్రసమర్పణకు గాను, ఇరాన్‌లో 2006లో జరిగిన 36వ రోష్డ్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో అంతర్జాతీయ వర్క్షాప్‌నకు స్పెషల్‌ ఇన్వైటీ. `దక్షిణ కొరియాలోని సియోల్‌లో 2006లో జరిగిన 8వ సియోల్‌ ఇంటర్నేషనల్‌ యూత్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఇండియన్‌ ఎడ్యుకేషన్‌ సిస్టమ్‌ ఎట్‌ ఎ ఎడ్యుకేషనల్‌ ఫోరమ్‌పై పత్ర సమర్పణకు గాను స్పెషల్‌ ఇన్వైటీ ` ఉత్తరాఫ్రికాలోని ట్యునీషియాలో సౌసె ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఫర్‌ చైల్డ్‌హుడ్‌ యూత్‌లో ఇంటర్నేషనల్‌ జ్యూరీ ` ఇటలీలో 2004లో జరిగిన గిఫోని ఫెస్టివల్‌ కు స్పెషల్‌ ఇన్వైటీ ` 2004లో జరిగిన 8వ హెంగ్డియాన్‌ చైనా ఇంటర్నేషనల్‌ చిల్డ్రన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు స్పెషల్‌ ఇన్వైటీ ` 2004లో జరిగిన 8వ ఢాకా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు స్పెషల్‌ ఇన్వైటీ ` 2003లో ఫిలిప్పీన్స్‌లో జరిగిన ఆసియన్‌ ఫిల్మ్‌ ఫోరమ్‌ ` మనీలా లో చిల్డ్రన్‌ ఫిల్మ్‌ మేకింగ్‌ (ఆసియా)పై రిసోర్స్‌ స్పీకర్‌ ` ఇరాన్‌లో 2003 మరియు 2004లో జరిగిన 18వ మరియు 19వ ఇస్‌ఫాహాన్‌ చిల్డ్రన్‌ అండ్‌ యంగ్‌ అడల్ట్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌కు స్పెషల్‌ ఇన్వైటీ `కాంపిటీషన్‌లో సినిమాు పాల్గొంటున్న నేపథ్యంలో 1987, 1989 మరియు 1991లో జరిగిన ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్‌ డాక్యుమెంటరీ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (ముంబై)కు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా హాజరు. ` హైదరాబాద్‌లో జరిగిన 18వ ఇంటర్నేషనల్‌ చి్డన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌, 2013 సందర్భంగా లిటిల్‌ డైరెక్టర్స్‌ జ్యూరీలో జ్యూరీ Vamsiglobal (చర్చ) 21:54, 7 నవంబర్ 2015 (UTC)[1]

  1. http://www.rolanbf.com/index.php?option=com_content&view=article&id=230&Itemid=606&lang=en http://www.rolanbf.com/index.php?option=com_content&view=article&id=230&Itemid=606&lang=en. {{cite web}}: External link in |website= (help); Missing or empty |title= (help)