వాడుకరి:Venkataramana6175/ప్రయోగశాల
అభ్యుదయ రచయిత కసుపు వెంకటరమణ
నా గురించి....
పూర్వ వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ పట్టణంలో 19801లో జన్మించాను. మా నాన్నగారు యతిరాజం, అమ్మ అక్ష్మీబాయి. కడు పేద కుటుంబం. 1971లో మానుకోటలో సొంతంగా ఇళ్లకు కొనుక్కున్నారు అమ్మ, నాన్న. నాన్న టిఫిన్ హోటల్ నడిపేవారు. చిన్న గుమ్చీలో అప్పాలు అమ్మేవారు. అమ్మ ఇస్తార్లకు కుట్టేది. నా చదువు కోసం వారు ఎంతో శ్రమించారు. నేను ఇంటర్లో చేరగానే.. నాన్న కాలం చేశారు. చివరి చూపు నాకు దక్కలేదు. అప్పటి నుంచి అమ్మే అన్నీ.
బడి పంతులుగా...
చిన్నతనంలోనే సంపాదన తప్పనిసరైంది. ఇంటర్ రెండో సంవత్సరం నుంచే ప్రయివేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాను. ట్యూషన్లు చెప్పేవాడిని. నాకు గణితంపై పట్టు ఉండడంతో చాలా మంది పిల్లలు వచ్చేవాళ్లు. మూడు నాలుగు పాఠశాలల్లో మ్యాథ్య్స్, ఫిజిక్స్ పదోతరగతి వరకు చెప్పేవాడిని. నా సబ్జెక్టులో వంద శాతం మార్కులు వచ్చేవి.
చిన్నప్పుడే కలం పట్టాను..
ఏడో తరగతి నుంచే నాకు కవితలు రాయడంపై ఆసక్తి ఏర్పడింది. అప్పట్లో మా తెలుగు మాస్టారు మద్దెర్ల రమేష్ గారి ప్రభావం నాపై ఉండేది. ఆయన ఇంట్లో పెద్ద గ్రంథాయలం ఉండేది. కథలు, కవితలు వార్త పత్రికలకు పంపేవాడిని. ప్రచురితం అవుతుండటంతో ఇంకా ఇంకా రాసేవాడిని.
ధిక్కర స్వరం..
నాది ఆది నుంచీ ధిక్కార స్వరమే.. నచ్చనిది ఏదైనా.. ముందర ఉన్నది ఎవరైనా విమర్శిస్తా. నా రచనల్లో కూడా అది స్పష్టంగా కనిపిస్తది.
జర్నలిజంలో అడుగు
పాఠశాల నుంచి నేరుగా జర్నలిజం వైపు అడుగులు వేశా. అన్న, కేసరి, ఆంధ్రావణి, హైదరాబాద్ టైమ్్స, ప్రజాశక్తి, ఆంధ్రప్రభలో విలేకరిగా పనిచేశాను. కానీ అనుకున్న గుర్తింపు రాలేదు. 2010లో ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాల నుంచి ఖమ్మం జిల్లాకు సబ్ ఎడిటరుగా వచ్చా. ప్రస్తుతం ఫీచర్స్ ఇన్చార్జ్గా కొనసాగుతున్నా.
- ↑ మహబూబాబాద్