Jump to content

వాడుకరి:YEDURUMUNIRAJA/ప్రయోగశాల

వికీపీడియా నుండి

చిన్నప్పటి నుండే సినిమా రంగం పై ఆసక్తి ఉన్న నేదునూరి శ్రీనివాస్ ఇంటర్మీడియట్ విజయనగరం మహారాజా కళాశాలలో చదవడం వల్ల విజయనగరం లో జరిగే సాహితీ సమావేశాలకు ఎక్కవగా హాజరవుతూ సాహిత్యం పట్ల మక్కువ పెంచుకున్న నేదునూరి శ్రీనివాస్ అక్కడే చాలామంది రచయితలతో పరిచయాలు పెంచుకోవటం, కథా రచనకు బీజం వేయటం జరిగింది. తెలుగు సాహిత్య రంగంలో లబ్ధ ప్రతిష్టులయినటువంటి

విశాఖపట్నం రచయితలు కాoడ్రేగుల శ్రీనివాసరావు, శ్రీ చరణ్ మిత్ర, కాళీపట్నం మూర్తి ( కలం పేరు నందివాడ నిర్మల) శ్రీనివాస్ శ్రీ , నంద చైతన్య లాంటి రచయితల ప్రోత్సాహంతో కథలు రాయడం ప్రారంభించారు.

రాసిన కథలు వాస్తవానికి దూరంగా సినీ రచనా శైలిలో ఉండటం వల్ల ఏ కథ కూడా మొదట్లో ప్రచురణకు నోచుకునేవి కాదు. ఇక..రాను రాను సినీ ఇండస్ట్రీ పై ఆసక్తి పెరగటం . అప్పటికే RGV shiva, వంశీ గారి సినిమాలు , జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రాలు అతని ఆలోచనలపై విపరీతమయిన ప్రభావం చూపడంతో హైదరాబాద్ సినీ ఇండస్ట్రీ కి రావడం జరిగింది. టాలీవుడ్ లో ప్రయత్నాలు కొనసాగిస్తున్న సమయంలో సీనియర్ కళా దర్శకులు భాస్కర రాజు గారితో పరిచయం శ్రీనివాస్ కు టర్నింగ్ పాయింట్. గుణశేఖర్ డైరెక్ట్ చేసిన రామాయణం చిత్రానికి అప్రOటీస్ గా చేయడం జరిగింది .ఆ చిత్రం టెక్నీకల్ గా చాలా విషయాలు నేర్పించడం , ఆ చిత్రం లో ఆర్ట్ డైరెక్టర్ భాస్కర రాజు గారి ప్రతిభ ఇవన్నీ కూడా సినిమా పరిశ్రమ పై ఇంకా ఆశక్తిని పెంచాయి. ఆ చితం పూర్తయిన తరువాత ఖాళి. సినీ ఇండస్ట్రీ లో కష్టాలు స్టార్ట్ అయ్యాయి. అప్పుడే ..రాసిన మానవత్వం కథ 1997 ఆంధ్ర భూమి వారపత్రికలో ప్రచురణకు నోచుకుంది . ఇదే ఉత్సాహం తో వివిధ వార్తా పత్రికలకు ఆర్టికల్స్ , కాలమ్స్ ,ఉజ్వల పత్రికకు కథలు రాయడం అవి ప్రింట్ అవడం జరిగింది.సినీ ఇండస్ట్రీ లో పరిచయాలు పెరిగాయి. డైరెక్టర్ గా టార్గెట్ రీచ్ అవ్వాలంటే ముందు చాలా హార్డ్ వర్క్ అవసరం అని గ్రహించి రామోజీ ఫిలిం సిటీలో జాయిన్ అవడం జరిగింది. ఇక .. అక్కడి నుంచి ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళు నిర్మించిన పాడుతా తీయగా, నిన్ను చూడాలని చిత్రం నుంచి నువ్వే కావాలి, చిత్రం, శుభవేళ,మెకానిక్ మామయ్య,దీవించండి, మూడుముక్కలాట , నీతో, ఇష్టం, మనసుంటే చాలు ఆనందం లాంటి చిత్రాలకు, క్రోకొడయల్, నైట్ ఫాల్,లాంటి హాలీవుడ్ చిత్రాలకు, చాంపియన్, రాజ్ కుమార్ సంతోషి డైరెక్ట్ చేసిన లజ్జా లాంటి బాలీవుడ్ చిత్రాలకు షూటింగ్ పర్పస్ కంపెనీ ఆర్ట్ అసిస్టెంట్ గా మాయా విభాగంలో దాదాపు తొమ్మిది సంవత్సరాలు పని చేసి.. తొలి ప్రయత్నం గా సంధ్యారాగం చిత్రానికి కథ , స్క్రీన్ ప్లే , మాటలు , దర్శకత్వం వహించారు.ఈ చిత్రాన్ని మయూరి విడుదల చేయడం విశేషం.