Jump to content

వాడుకరి:YVSREDDY/కొసరు

వికీపీడియా నుండి

కొసరు అంటే వస్తువులు కొన్నప్పుడు కొన్నవస్తువులకు పైన ఉచితంగా లభించిన కొసభాగం అని అర్థం. కొసరు పొందిన కొనుగోలుదారుడు ఎక్కువ ఆనందం పొందటం వలన అసలు కన్నా కొసరు ఎక్కువ అంటారు. కొసరు కోరడాన్ని కొసరడం లేక కొసరించడం అంటారు. అమ్మకందారుడు కూడా కొసరు ఇచ్చి కొనుగొలుదారులను ఆకర్షిస్తాడు. ఈ కారణంగా అమ్మకందారుడు కూడా సంతోషపడతాడు. కొసరుకు వ్యతిరేకం ఎసరు. ఎక్కువగా కూరగాయలు, పండ్లు కోనేటప్పుడు కొసరు కోరడం, కొసరు ఇవ్వడం జరుగుతుంటుంది. వస్తువులను తూచేటప్పుడు అడిగిన తూకానికి పైన మొగ్గు వాలినప్పుడు ఈ మొగ్గును కొసరు కింద ఉచితంగా ఇస్తారు. అందువలన కొసరును మొగ్గు అని కూడా అంటారు.

[[వర్గం:పదజాలం]