వాడుకరి:YVSREDDY/పానీయం
Jump to navigation
Jump to search
17-02-2023న సృష్టించబడిన వ్యాసంలోని సమాచారం
[మార్చు]పానీయం అనగా త్రాగుటకు ఉపయోగించే ద్రవం. పానీయమును దాహాన్ని తీర్చుకునేందుకు వినియోగిస్తారు. ప్రకృతిలో నీరు సహజసిద్ధంగా లభించే పానీయం. మానవుడు ప్రత్యేకంగా తయారు చేసిన కూల్ డ్రింక్స్, సోడా, రసం, కాఫీ, టీ, మద్యం వంటి ద్రవ పదార్థములు కృత్రిమమైన పానీయములు. పానీయం అనేది నోటి ద్వారా త్రాగే ద్రవం. పానీయంను ఆంగ్లంలో డ్రింక్ అంటారు.
రక రకాల పానీయాలు
[మార్చు]- ఆరోగ్య పానీయం: ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా తయారు చేసే పానీయమును ఆరోగ్య పానీయం అంటారు. ఈ పానీయాలలో పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు, శరీరానికి మేలు చేసే ఇతర పదార్థాలు ఉండవచ్చు. ఆరోగ్య పానీయాల యొక్క కొన్ని ఉదాహరణలు: పానకం, గ్రీన్ టీ, పండ్ల రసం, కొబ్బరి నీరు, పాయసం
- మద్య పానీయం: శరీరానికి మత్తును కలిగించే పానీయమును మద్య పానీయం అంటారు. సాధారణంగా ఇవి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. ఉదాహరణలు: బీరు, సారాయి, కల్లు, బ్రాంది, విస్కీ వంటివి
- శీతల పానీయం: చల్లగా వుండే పానీయంను శీతల పానీయం అంటారు. ఉదాహరణలు: నిమ్మరసం, కొబ్బరి నీరు, మజ్జిగ, జ్యూస్, కూల్ డ్రింక్‌లు మొదలైనవి
- వేడి పానీయం: వేడిగా వుండే పానీయంను వేడి పానీయం అంటారు. ఉదాహరణలు: టీ, కాఫీ
పండ్ల రసం
[మార్చు]పకృతి నుంచి లభించే పండ్లతో అప్పటికపుడే తయారుచేసే రసాన్ని పండ్లరసం అంటారు. పండ్లరసంతో తయారు చేసిన పానీయంను పండ్లరస పానీయం అంటారు. ఉదాహరణలు: మామిడి పండ్ల రసం, ద్రాక్ష రసం
మూలాలు
[మార్చు]- ఉసిరి+కలబంద.. ఆరోగ్య పానీయం
- ఉదయాన్నే టీకి బదులుగా ఈ పానీయాలు తాగండి.. బెల్లీఫ్యాట్ సులువుగా కరుగుతుంది..!
- కండల కోసం ప్రొటీన్ షేక్‌లకు బదులు ఈ పానీయం తాగండి
- ప్రపంచంలోనే అత్యంత మత్తునిచ్చే లిక్కర్ బ్రాండ్స్ ఇవే.. ఒక్క సిప్ తాగిన ఊగిపోతారు అంతే..
- కొబ్బరి బోండాంలో నిమ్మరసం కలుపుకొని ఎప్పుడైనా తాగారా?
[[వర్గం:ద్రవ పదార్థాలు] [[వర్గం:పానీయాలు]