వాడుకరి:YVSREDDY/మాంసపు తోరణములు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మాంసపు కూరకు ఉపయోగించే వేట మాంసం ప్రతి రోజు దొరకని మారు మూల ప్రాంతాలలో నివసించే పల్లెవాసులు వేట మాంసమును చిన్న చిన్న ముక్కలుగా కోసి వాటికి ఉప్పు, పసుపును అంటించి వాటిని దబ్బనం ద్వారా పురికోస లేక తాడుకు ఎక్కించి వాటిని ఎండ బెట్టి తరువాత వాటిని తోరణముల మాదిరిగా వాటిని ఇంటిలో వ్రేళాడదీస్తారు. ఈ విధంగా వ్రేలాడ దీసిన తోరణములను మాంసపు తోరణములు అంటారు.ఇలా దండెం కట్టిన ఎండుమాంసం తునక లను ఉప్పాసులు అని కూడా అంటారు.

ఈ మాంసపు తోరణములను అప్పుడప్పుడు ఎండ బెడుతుంటే అవి చెడి పోకుండా కొన్ని రోజుల నుండి కొన్ని నెలల వరకు నిల్వ ఉంటాయి.

ఈ మాంసపు తోరణములలోని మాంసమును మామూలు పచ్చి మాంసము మాదిరిగానే కూరకు ఉపయోగించవచ్చు.

[[వర్గం:ఆహార పదార్థాలు]