వాడుకరి:Yohandanday

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కైకలూరు మండలం లోని ఒక గ్రామ పంచాయితీ " రాచపట్నం" . సరిగ్గా కైకలూరు నుండి కలిదిండి వెళ్ళే మార్గంలో ఈ రెండు పట్టణాలకు మధ్యలొ వుంటుంది. అనగా కైకలూరు నుండీ కలిదిండికి 12 కీ.మీ దూరం కాగా రాచపట్నం గ్రామం మధ్యలో వుంటుంది. రాచపట్నం గ్రామానికి సరిహద్దు గ్రామాలు 1. గోపవరం 2. చింతల చెరువు (యిది యీ గ్రామానికి గ్రామశివారు అవుతుంది) 3. వరహా పట్నం 4. చింతల మూరు గ్రామాలున్నాయి. యీ గ్రామంలో ఒకప్పుడు ఎక్కడ చూసినా మంచినీళ్ళ చెరువులుండేవి. రెండు కాలువల మధ్యలో చుట్టూ పచ్చని పంట చేలతో ఎంతో మనోహరంగా వుండేది. యిప్పుడక్కడ ఏ బావిలో కూడా మంచినీళ్ళు దొరకడం అనే ప్రశక్తే లేదు. ఊరిలో రెండు ఆంజనేయ స్వామి ఆలయాలు, ఒక రామాలయం, ఒక C B C N C చర్చి మరొక R C M చర్చి వున్నాయి. మా యిల్లు C B C N C చర్చికి సరిహద్దు గా వుంటుంది. గ్రామం చుట్టూ వున్న పొలాల్లొ విపరీతంగా కొబ్బరి చెట్లు , మామిడి చెట్లు , యింకా ఎన్నొ పండ్ల చెట్లు వుండేవి. నిజంగా మా ఊరు చాలా అందంగా వుండేది. కేవలం ప్రాధమిక విధ్య మాత్రమే మా ఊరిలో వుండేది. హైస్కూల్ అంటే 2 కీ.మీ దూరం లొ పెద్ద కాలువ గట్టు ను ఆనుకుని వున్న ఆరుతెగల పాడు గ్రామానికి వెళ్ళవలసిందే. యిహ యింటర్మీడియెట్ అయితే ఛలో కైకలూరు. రాచపట్నానికి సరిహద్దుగా వున్న వరహాపట్నం కు , మాకు ఒక్కటే సెంటర్ , మేము రాచపట్నం సెంటర్ అంటే వాళ్ళు దానినె వరహా పట్నం సెంటర్ అంటుంటారు. రెండు గ్రామాల మధ్య యిదొక పెద్ద ఫన్.