వాడుకరి చర్చ:Rajashekar.oddem/ప్రయోగశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వేములవాడ భీమకవి. తెలంగాణ సాహిత్యానికి పునాది వేసిన తొలితరం రచయితల్లో వేములవాడ భీమకవి ఒకరు. తొలి ద్వ్యర్థికావ్యం రచనతో తెలంగాణ సాహితీలోకానికి మార్గదర్శనం చూపారు. తన ద్వర్థికావ్యంతో కవిసార్వభౌముడినే కట్టిపడేశారు.సాక్ష్యాత్తు శ్రీనాథుడే తానూ.. భీమకవిలాగా ఉద్దండలీలగా రాస్తానన్నడంటే భీమకవి సాహితీ ప్రతిభ ఎంటో అర్థమవుతుంది. భీమకవి ఎవరినీ అనుసరించలేదు. తనకంటూ ఒక మార్గాన్ని ఎంచుకున్నాడు. తన పంథాలోనే రచనలు చేశాడు. భీమకవి ప్రస్తుత రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడకు చెందిన వాడని చరిత్రకారుల అంచనా.ఇతని రచనలు ఏవీ లభించక లేవు. అయినా ఇతర కవులు అతని గురించి పేర్కొనడం వలన భీమకవి పేరు తెలంగాణ సాహిత్యంలో సుపరిచితమైంది. భీమకవి వాక్పటుత్వం కలిగినవాడని, శాపానుగ్రహ సమర్ధుడని కూడా ప్రజా బాహుళ్యంలో పలురకాల కథలు ఉన్నాయి. రాఘవ పాండవీయం, శతకంధర రామాయణం, నృసింహ పురాణం, బసవ పురాణం వంటి రచనలు చేశాడని చెబుతున్నారు. కవి జనాశ్రయం అనే లక్షణ గ్రంథాన్ని కూడా రాశాడని ఒక నానుడి. భీమకవి గురించి పింగళి సూరన్న కూడా ప్రస్తావించారు. రాఘవ పాండవీయం అనే ద్వ్యర్థికావ్యం భీమకవి రాసినట్లు తన రచనల్లో పేర్కొన్నరు పింగళి సూరన్న. అంటే 13, 14వ శతాబ్దం నాటికే తెలంగాణలో తొలి ద్వ్యర్థి కావ్య రచనకు బీజం పడిందని తెలుస్తున్నది. భీమకవి లాంటి ఎందరో సాహితీవేతలు చరిత్ర పుటల్లో మరుగునపడ్డారు. భాషాభివృద్దికి వారు చేసిన కృషి అనిర్వచనీయం. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా మరొక్కసారి వేములవాడ భీమకవిని స్మరించుకుందాం.