వాడుకరి చర్చ:Vu3ktb/పాతచర్చలు 4

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పాత పత్రికలు[మార్చు]

శివా! (1) మీ దగ్గర పాత పత్రికల నిధి ఉన్నదనుకొంటాను. ఉంటే వాటిలో సినిమా ప్రకటనలను స్కాన్ చేసి అప్‌లోడ్ చేస్తే బాగుంటుంది. (2) వచ్చేవారం గుడిపాటివెంకటచలం వ్యాసం "ఈ వారం వ్యాసం"గా పెడదామనుకొంటున్నాను. ఏమయినా సవరణలు అవసరమనిపిస్తే చేయండి. (3) వెన్నూతల గురించి మరికొంత సమాచారం చేరిస్తే దానిని కూడా "ఈ వారం వ్యాసం"గా పెడదాము. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 04:35, 18 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

కాసుబాబుగారు నమస్తే. చాలా కాలనికి మీ దగ్గరనుండి ఒక్ వర్తమానం వచ్చింది. నాదగ్గర పాత చందమామలు, యువలు చాలా ఉన్నాయి, కుదిరప్పుడల్లా అందులోంచి బొమ్మలు (వడ్డాది పాపయ్యగారివి, చందమామ ధారావాహిక ప్రధమ పుటలు లేదా పాత చిత్రాల పకటనలు) కొన్ని స్కాన్ చేసి లేదా పి డి ఎఫ్ పార్మాట్లో ఉన్నవి జెపిజి లుగా మార్చి అప్-లోడ్ చేస్తునె ఉన్నాను. మీరు ఈ విషయం కోరటం మరింత ఉత్సాహాన్నిచ్చింది మరిన్ని అప్-లోడ్ చేస్తాను.

గుడిపాటి వెంకటచలం వ్యాసం వచ్చేవారం "ఈవారం వ్యాసం"గా పెడుతున్నందుకు ధన్యవాదాలు. అందులో సాధ్యమయినంత సమాచారాన్ని ఉంచాను, వ్యాసాన్ని తూకంచెడకుండా మార్పులు చేసాను. మరిన్ని వివరాలు సంపాయించి పొందుపరచటానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ ముంబాయిలో నాపుస్తక నిధిలో కొంత మాత్రమే ఉన్నది అదొక చిన్న అవరోధం.

ఇక వెన్నూతల గురించి, నాదగ్గర అంతకు మించి వివరాలు లేవు. వికీలో వ్యాసం వ్రాయటానికి మాత్రమే ఆ వూరు 2-3 నెలల క్రితం వెళ్ళి అక్కడి ఫొటోలు, విశేషాలు ఉంచాను.ఆ వ్యాసంలో ఉంకొకాయన కూడా కొన్ని ఫొటొలను ఉంచారు, ఆయన దగ్గర మరింత సమాచారం ఉన్నదేమో ఆయనకు కూడా దయ చేసి ఒక మెసేజి ఉంచండి.

రేపు కూడా ఇక్కడ శెలవు (బుద్ద జయంతి అనుకుంటాను) కాబట్టి కొన్ని చలనచిత్ర ప్రకటనలు అప్ లోడ్ చేయగలను.--SIVA 04:54, 18 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

రాజనాల-ఆర్ నాగెశ్వరరావు[మార్చు]

ఈ ఇద్దరు వేరు వెరు నటులు. కాని "వెతుకు"లో రాజనాల వెతికి వెళ్తే, ఆర్ నాగేశ్వరరావు పుటలోకి వెల్తున్నది, పైగా రాజనాల నుండి దారి మళ్ళింపు అని వ్రాసి ఉన్నది. దయచేసి చూడగలరు. ఆక్కడ చర్చా పుటలో వ్రాస్తే ఎవరన్నా చూస్తారో లేదొ తెలియదు అందుకని, మీకు సందేశం పంపుతున్నాను.--SIVA 06:09, 18 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

చలం మ్యూజింగ్స్[మార్చు]

శివ గారూ, సినిమా వ్యాసాలపై కృషి చేస్తున్నందుకు కృతజ్ఞతలు. కానీ చలం మ్యూజింగ్సులో వివిధ సినిమాలపై చలం అభిప్రాయాలను యధాతధంగా ఇక్కడ వ్రాయవద్దు. ఎందుకంటే 1) చలం గారు మరణించి ఇంకా 60 యేళ్ళు కాలేదు. కాబట్టి మూజ్యుంగ్స్ కు కాపీహక్కులున్నాయి. 2) ఒక సినిమాపై ఫలానాయన అభిప్రాయం కేవలం ఒక అభిప్రాయమే. వందల అభిప్రాయాలలో అది ఒకటిమాత్రమే కాబట్టి దాన్ని ఆ స్థాయిలోనే ఉంచితే వ్యాసానికి సమతుల్యత ఉంటుంది. చలంగారి అభిప్రాయం చెల్లదని కాదు నా ఉద్దేశం, చలం అభిప్రాయంతో వ్యాసం మొత్తం నింపెయ్యకుండా క్లుప్తంగా వ్రాస్తే బాగుంటుంది. ఒక ప్రత్యేక విభాగంగా కాకుండా, ఉదాహరణకు ఫలానా సినిమాలో నటీనటుల అభినయము పేలవంగా ఉందని పలువురు విమర్శకులు విమర్శించారు. దీని గురించి ప్రముఖ స్త్రీవాద రచయిత చలం ఇలా అన్నాడు "చలం వ్యాఖ్య" వ్రాస్తే బాగుంటుందని నా అభిప్రాయం. --వైజాసత్య 03:25, 20 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నా అభిప్రాయం రికార్డు కోసం వ్రాస్తున్నాను. - వైజా సత్య నియమాలు మరీ కఠినంగా ఉన్నాయనిపిస్తుంది. (1) మ్యూజింగ్స్‌కు కాపీ హక్కులున్నా గాని అక్కడక్కడా కొటేషన్లు, మూలాలను సరిగ్గా పేర్కొంటూ, ఇచ్చినందువల్ల కాపీ హక్కుల ఉల్లంఘన అననక్కరలేదు. (2) అనేక అభిప్రాయాలలో ఇది ఒక్కటి సరే. కాని శివా ఒక అభిప్రాయం మాత్రమే వ్రాసారు. వ్యాసంలో వేరే ఏమీ లేనందువల్లనే ఇది ప్రముఖంగా కనిపిస్తున్నది. ఇతర విషయాలను, అభిప్రాయాలను వ్రాయడానికి అవరోధం లేదు. ముందు ముందు ఎవరైనా వ్యాసాన్ని విస్తరిస్తే అటోమాటిక్‌గా మొత్తంలో ఇది ఒక చిన్న భాగమవుతుంది. "ఫలానా సినిమాలో నటీనటుల అభినయము పేలవంగా ఉందని పలువురు విమర్శకులు విమర్శించారు" - అని ఆధారం లేకుండా శివా ఎలా వ్రాయగలరు?(3) ఇలా ప్రతి వ్రాతకూ మనం అభ్యంతరం చెబితే అసలు వ్యాసాలు పెరిగే అవకాశం కష్టం. శివా వ్రాసిన దానిని నేను ప్రోత్సహిస్తున్నాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 12:15, 22 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]
కాసుబాబు గారూ, మీరన్నది నిజమే, ఈ నియమాలన్నీ మార్గదర్శకాలేకానీ, కాళ్ళకు సంకెలేసే బంధాలు కాదు, కాకూడదు. నేను ఎటువైపు పయనించాలో చెప్పాలనుకున్నాను :-)--వైజాసత్య 01:22, 23 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

వెన్నూతల గురించి[మార్చు]

శివాగారు , ఇన్నాళ్ళ నుంచి సమాధానం ఇవ్వనందుకు సారీ. నేను తరచుగా వికీపీడియా చూడను. ఎప్పుడో ఖాలీ సమయం లో లాగిన్ చేసి చూస్తో ఉంటా. మీకు గుర్తు ఉందొ లేదో , నేను మిమ్మలిని ముంబాయి లో రాంవిహారి మామయ్యా ఇంట్లో కలిసా. నేను అచ్యుతరామయ్య గారి పెద్ద అమ్మాయి శ్యామల గారి పెద్ద కుమారుడిని. నేను ప్రస్తుతం పూణే లో IBM లో పని చేస్తున్నా. మన గ్రామం ఈ వారం వ్యాసం గా వస్తుంది అంటే నాకు చాల సంతోషంగా ఉంది . కాని ఒక్క చిన్న సందేహం , మీ నుంచి మెసేజ్ వచ్చి తొమ్మిది రోజులు అయ్యింది , అంటే వెన్నూతల గురుంచి క్రితం వారం వ్యాసం వచ్చిందా ? నేను క్రితం సోమవారం వెన్నూతల వెళ్ళా . అక్కడ స్వామివారి కల్యాణం జరిగింది. ప్రతి సంవత్సరం మే లో కల్యాణం జరుగుతుంది అక్కడ. ఇక నుంచి అక్కడ ఏమైనా కార్యక్రమములు జరిగితే నేను మీకు కూడా చెప్తాను. వీలు చూసి మీరు కూడా రావచ్చు. కల్యాణం ఫొటోస్ నేను వెన్నూతల homepage లో ఉంచాను. ఇక నుంచి నేను కూడా సాధ్యమైనంత సమయం వికిపీడియాకు కేటాయిస్తాను. మళ్ళి కలుద్దాం.వెంకట్. :-)--వెంకట్004 21:02, 27 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నా సమాధాన సందేశం[మార్చు]

వెంకట్! నీ దగ్గర నుండి సందేశం వచ్చినందుకు సంతోషం, నువ్వు మాకు చాలా దగ్గర బంధువు కావటం మరింత సంతోషాఅన్ని ఇచ్చింది.వెన్నూతల గ్రామ వ్యాసాన్ని ఈ వారం వ్యాసంగా పెడదాము, మరిన్ని వివరాలు పొందుపరచమని, కాసుబాబుగారు చెప్పారు. అప్పుడు నీకు మరిన్ని వివరాలు తెలిస్తే వ్యాసంలో వ్రాయమని మెసేజ్ ఇచ్చాను.

నా ఉద్దేశ్యంలో మన ఊరి గురించి మరిన్ని వివరాలు:

  1. వ్యవసాయ భూమి ఎంత విస్తీర్ణం;
  2. ఏ ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో పందిస్తున్నారు,
  3. ఈ గ్రామానికి "వెన్నూతల" అనె పేరు ఎలా వచ్చింది(ఈ విషయం మీద నిర్దిష్టమైన వివరాలతో,ఆధారాలతో వ్రాయగలిగితే వ్యాసం పరిణితి పెరుగుతుంది);
  4. వెన్నూతల గ్రామ ప్రముఖులు అంటే ఆ వూరికి చెంది, బయట ప్రపంచంలో చాలా పేరు పఖ్యాతులు సంపాయించుకున్నవారు(శ్రీ విశ్వనాధ సత్యనారాయణగారు ఆ వూళ్ళో కొంత కాలం చదువుకున్నారట, ఎవరి దగ్గర??? తెలియదు!!)
  5. ఈ గ్రామ ప్రస్తుత పంచాయితి సర్పంచి ఎవరు;
  6. మొదటనుండి ఇప్పటివరకు, ఎవరు ఎప్పటినుండి ఎప్పటివరకు, గ్రామ సర్పంచిగా పనిచేశారు
  7. గ్రామానికి కరెంటు ఎప్పుడు వచ్చింది;
  8. గ్రామానికి బస్సు సౌకర్యం ఏ సవత్స్రరంలో ప్రారంభమయ్యింది (1980లలో అనుకుంటాను)
  9. లేటెస్టు సెన్సెస్ ప్రకారం గ్రామ జనాభా ఎంత

వంటి వివరాలు సేకరించి వ్యాసంలో పొందుపరిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.

తరువాత వ్యాసంలో ఫొటోలు ఎక్కువయినాయని నా అబిప్రాయం. ఈ మధ్య జరిగిన కళ్యాణం ఫొటోలలో చాలా క్లోజప్ చిత్రాన్ని అప్ లోడ్ చెయ్యటం జరిగింది. దానికి బదులుగా, కళ్యాణం జరుగుతుండగా అక్కడ ఉన్న జన సందోహం, గుడి బాక్ గ్రౌండుతో ఉన్న ఫొటొ ఉంటే అప్లోడ్ చెయ్యండి. నేను దాదాపు 100 ఫొటోలు తీసాను, అందులో చాలా స్ట్రిక్ట్ గా వెతికి, గ్రామానికి సంబంధించిన లాండ్ మార్కులు మాత్రమే వ్యాసంలో ఉంచాను. రామాలయం కూడా పునరుద్ధరించారని వ్రాశావు. రామాలయం ఫొటో ఉంటే అప్ లోడ్ చేస్తే బాగుంటుంది.

కొత్తవారు వ్యాసాన్ని చూసినప్పుడు, ఫొటోల వల్ల గ్రామం గురించి కొంత ఎక్కువ విషయాలు తెలియాలి.

వ్యాసాన్ని ఇంకా ఈ వారం వ్యాసంగా ప్రదర్శించలేదు. కాబట్టి మరిన్ని వివరాలు, తెలిసిన వారిని కనుక్కుని వ్యాసంలో పొందుపరస్తే బాగుంటుంది. మన బంధువులలో పెద్దవారికి ఇంకా వివరాలు తెలిసి ఉండచ్చు. వారి సహాయంతో వ్యాసాన్ని పరిపూర్ణం చెయ్యచ్చును. పూర్తి వివరాలు తగినంత ఆధారాలతో పొందుపరచాలి. నా ఇ మైల్ VU3KTB@GMAIL.COM . పూర్తి వివరాలతో వ్యాసం పరిపూర్ణమయిన తరువాత, మనం ఈ వారం వ్యాసంగా ఉంచటానికి ప్రదిపాదిచుదాము. ఇతర గ్రామాల మీద వ్యాసాలు ఒక సారి చూసి, వాటికి దీటుగా మనం మన గ్రామ వ్యాసాన్ని కూడా తయారు చెయ్యాలని నా కోరిక--SIVA 00:59, 30 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

వెంకట్ నుంచి సందేశం[మార్చు]

శివాగారు , మీ నుంచి సందేశం వచ్చినందుకు సంతోషం. మీ సలహా ప్రకారం నేను మన గ్రామం గురుంచి , మీరు చెప్పిన అంశం గురించి సమాచారం collect చేసేందుకు ప్రయత్నిస్తాను. మీరు చెప్పినట్టుగా ఫొటోస్ కొంచం ఎక్కువ అయ్యాయి. కొన్ని తొలగించటానికి ప్రయత్నిస్తాను. వెన్నుతల నుంచి చలంగారు నాకు రామాలయం ఫోటో పంపిస్తాను అని అన్నారు . అవి వచ్చిన పిమ్మట నేను update చేస్తాను. త్వరలో మళ్ళి కలుస్తాను. వెంకట్.