Jump to content

పద్మావతి వానపల్లి

వికీపీడియా నుండి
(వానపల్లి పద్మావతి నుండి దారిమార్పు చెందింది)

వీరు, శ్రీమతి రావూరి రాఘవయ్య, రావూరి వీర్రాజు దంపతులకు జన్మించారు. ఎంగ్ మెన్స్ హేపీక్లబ్ – కాకినాడ సంస్థలో శిక్షణ పొందిన ఈవిడకు 50 సంవత్సరాల అనుభవముంది.

నాటక రంగం

[మార్చు]

బాలనాగమ్మ, భస్మాసుర, తారాశశాంకం, చింతామణి, మైరావణ, గయోపాఖ్యానం, సుభద్రాపరిణయం, ఖిల్లీ రాజ్యపతనం, బొబ్బిలియుద్ధం, రామాంజనేయ యుద్ధం, మాయాబజార్, హరిశ్చంద్ర, పద్మవ్యూహం, భీష్మ, సక్కూబాయి, రామదాసు, సత్యభామా విజయం, శరణం అయ్యప్ప, చాణక్య, కాంతామణి మొదలగు పద్యనాటకాల్లో నటించారు. కన్యాశుల్కం, కంఠాభరణం, వరవిక్రయం, ఓన్లీడాటర్, వీధి గాయకులు, పల్లెపడుచు, కులం లేని పిల్ల, పేదపిల్ల, చిల్లరకొట్టు చిట్టెమ్మ, కన్నీటి దీపాలు, మనస్తత్వాలు, రక్తకన్నీరు, ఒరేయ్ మొదలగు సాంఘిక నాటకాల్లో కూడా నాయకి పాత్రలు ధరించారు.

నటీమణిగా కీర్తి

[మార్చు]

ఎన్నోసార్లు ఉత్తమ నటి బహుమతులు, ప్రశంసా పత్రాలు అందుకొని ప్రథమశ్రేణి నటీమణిగా కీర్తిని గడించారు. ధూళిపాళ, పీసపాటి, షణ్ముఖి, జైరాజ్, శివశ్రీ, అక్కనాచారి, యమ్.జి. ఆచారి, సుభద్రరాజు, ఎ. వెంకట్వేశ్వరరావు, పృథ్వి వెంకటేశ్వర్లు వంటి నట శ్రేష్టులతోను శ్రీమతి అబ్బూరి కమల, శ్రీమతి పీసపాటి సత్యవతి, శ్రీమతి కోమలి, శ్రీమతి టి.ఎమ్.ఆర్. తిలకం వంటి ప్రముఖ నటీమణులతోను నటించారు. రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాలలో పలు ప్రదర్శనలిచ్చారు. ప్రాచీన నాటక సంస్థ కాకినాడ ఆంధ్ర సేవాసంఘం, రాజోలు ఎస్. ఆర్. ఎల్.జి. కళాసమితి ఓమెగా ఆర్ట్సు సంస్థవారి శతాధిక ప్రదర్శనల్లో విభిన్న పాత్రలు ధరించి విశేష ప్రశంసలు అందుకున్నారు.

మూలాలు

[మార్చు]

పద్మావతి వానపల్లి, కళాదీపికలు (సమకాలీన రంగస్థల నటీమణులు), ప్రథమ ముద్రణ, సంపాదకులు: వి.ఎస్. రాఘవాచారి., కళాదీపిక మాసపత్రిక, తిరుపతి, అక్టోబరు 2011, పుట. 57.