Jump to content

వాసా పెదరామయ్య

వికీపీడియా నుండి

వాసా పెదరామయ్య వీణా విద్వాంసులు[1]. వీరు ఆంధ్రదేశంలో ఒక విశిష్ట సాంప్రదాయం నెలకొల్పిన వైణికోత్తములు.

వాసా వారి కుటుంబం

[మార్చు]

వాసా వారి కుంటుమ్బంలో చాలామంది బొబ్బిలి ఆస్థాన విద్వాంసులుగా గాత్ర విద్వాంసులుగా, వైణికులుగా ఉండేవారు.[2]

వారి కుటుంబంలో పేరెన్నికగన్న వైణిక విద్యాంసులలో వారి మునిమనుమలు వాసా వెంకటరావు గారు ఒకరు. వీరు విజయరామ గాన పాఠశాలలో వీణా ప్రొఫెసర్ గా పనిచేశారు. వాసా వెంకటరావు విజయనగరం మహారాజా ఆహ్వానం మేరకు విజయనగరం వెళ్ళి అక్కడ రాజావారి కుమార్తెలకు వీణ నేర్పించాడు.

వీరి పుత్రులు వాసా కృష్ణమూర్తి (1923 - 1974) గారు నేటి వైణిక విద్వాంసులలో ప్రసిద్ధులు. వాసా కృష్ణమూర్తిగారు గీతాలూ అవీ రాసేవారు. పెదరామయ్య గారు విజయనగర ఆస్థాన విద్వాంసులుగా వుంటూ "జక్కిణదరువు" లనే సంగీత రచనలు అనేకం చేశారు.

రాజా రావుశ్వేతాచలపతి రంగారావు బహద్దూరు 1881లొ సంస్థానాధిపతిగా ఉన్న కాలంలో వాసా వెంకటరావు, వాసా కృష్ణమూర్తులను ఆస్థాన విద్వాంసులుగా నియమించుకున్నారు. వైణిక విద్వాభూషణ వాసా వెంకటరావు 1918 వరకూ బొబ్బిలి సంస్థానములొ ఉండి 1919లో విజయరామగాన పాఠశాల యందు వీణాధ్యాపకులుగా బాధ్యతలు స్వీకారం చేశాడు. బొబ్బిలి యందు ప్రతీ దసరా ఉత్సవాలు యందు వీరి కచేరీ తప్పనిసరిగా ఉండేది. బొబ్బిలి సంస్థానములొ వాసావారి కచేరీ ఏర్పాటు చేసి ఘనంగా సన్మాన సత్కారాలు పొందేవారు. వాసా కృష్ణమూర్తి కాలానికి బొబ్బిలి సంస్థానము నుండి పొందిన ఆస్తుల అన్నీ హరించుకుపోగా 1930 సంవత్సరానికి ముందుగానే వాసావారి కుటుంబం బొబ్బిలి విడిచిపెట్టి విజయనగరం, విశాఖపట్టణం చేరుకుని స్థిరపడ్డారు.

వాసా కృష్ణమూర్తి కుమారుడు వాసా వేంకట వరప్రసాద్‌ తిరుపతి లో టీటీడీ లో అన్నమాచార్య ప్రాజెక్ట్ డి పి పి తరపున వోకల్ ఆర్టిస్టుగాఉన్నాడు.[3]

సుప్రసిద్ధ విద్వాంసులు నందిగామ వెంకన్న గారు, తుమరాడ సంగమేశ్వరశాస్త్రి గారు, వాసా వారు ఒకే బంధువర్గానికి చెందినవారు.

మూలాలు

[మార్చు]
  1. "సంకల్ప సిద్ధులు.. సంగీత రసజ్ఞులు (అమృతవర్షణి) | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". andhrabhoomi.net. Archived from the original on 2020-07-21. Retrieved 2020-07-21.
  2. "Sujanaranjani". www.siliconandhra.org. Retrieved 2020-07-22.
  3. వెబ్ మాస్టర్. "ANNAMAYYA PARATATVAMU CD RELEASED _ "అన్నమయ్య పరతత్వం", "భజగోవిందం" సిడిలను అవిష్కరించినటిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ – TTD News" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-07-22. Retrieved 2020-07-22.