విఎస్‌టి పరిశ్రమలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విఎస్‌టి పరిశ్రమలు లిమిటెడ్
రకంసార్వత్రిక (బి.ఎస్.ఇ: 509966, మూస:NSE, మూస:ISIN) [1]
స్థాపితం10 నవంబరు 1930 (వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీగా)
ప్రధానకార్యాలయంఆజమాబాద్, హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్, భారతదేశం.
కీలక వ్యక్తులుఅభిజిత్ బాస్, ఛైర్మన్
రేమండ్ ఎస్. నోరోన్, మేనేజింగ్ డైరెక్టర్
ఎన్. సాయిశంకర్, డిప్యుటీ మేనేజింగ్ డైరెక్టర్ మరియు కార్యదర్శి[2]
పరిశ్రమబహుళ పరిశ్రమల కంపెనీ (కాంగ్లామరేట్)
ఉత్పత్తులుపొగాకు
ఆదాయం $117 మిలియన్లు [3]
ఉద్యోగులు1,117
వెబ్‌సైటు[1]

విఎస్‌టి పరిశ్రమలు లిమిటెడ్, హైదరాబాదు కేంద్రంగా ఉన్న ఒక సార్వత్రిక కాంగ్లామరేట్ కంపెనీ. ఈ కంపెనీ సిగరెట్లను ఉత్పత్తి చేసి, సరఫరా చేస్తుంది. కంపెనీ యొక్క నమోదు చేయబడిన కార్యాలయం హైదరాబాదులో ఉంది. వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీగా ప్రారంభమైన ఈ కంపెనీ విఎస్‌టిగా వ్యవహరించబడుతుంది. ఈ కంపెనీకి యునైటెడ్ కింగ్డమ్కు చెందిన బ్రిటీషు అమెరికన్ టొబాకో సంస్థతో సహకార ఒప్పందం ఉండేది.[1] 1983లో పూర్తిగా స్వతంత్ర కంపెనీగా రూపొంది, విఎస్‌టి పరిశ్రమలు లిమిటెడ్‌గా నమోదయ్యింది.[1][4] విఎస్‌టి అనేక బ్రాండు పేర్లతో సిగరెట్లను ఉత్పత్తి చేసి, సరఫరా చేస్తుంది. వీటిలో ఛార్మ్స్, చార్‌మినార్ మరియు గోల్డ్ సిగరెట్ బ్రాండ్లు ముఖ్యమైనవి. హైదరాబాదు ముఖ్యకేంద్రగా పనిచేస్తున్న ఈ కంపెనీ భారతదేశంలోనే మూడవ అతిపెద్ద సిగరెట్ల ఉత్పత్తిదారు.[5]

చరిత్ర[మార్చు]

కంపెనీ స్థాపకుడు వజీర్ సుల్తాన్

వజీర్ సుల్తాన్ & సన్స్ కంపెనీ వజీర్ సుల్తాన్ 1916లో హైదరాబాదులోని ప్రస్తుత విఠల్‌వాడీ ప్రాంతంలో ప్రారంభించాడు. వజీర్ సుల్తాన్ 1923 జూన్ 12న మరణించాడు. ఆయనకు ఏడుగురు కొడుకులు మరియు ముగ్గురు కూతుళ్లు. వజీర్ సుల్తాన్ వారసులు కంపెనీని 1930లో సార్వత్రికం చేసి, కంపెనీగా హైదరాబాదులో నమోదుచేశారు. పెద్దకొడుకు మహమ్మద్ సుల్తాన్ విఎస్‌టి పరిశ్రమలకు తొలి ఛైర్మన్‌గా ఉన్నాడు.

మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనకాలంలో హైదరాబాదు సంస్థానంలో హైదరాబాదు కంపెనీల చట్టం నెం.4 1320 ఫస్లీ ప్రకారం 1930 నవంబరు 10న నిజాం ఫర్మానుతో సార్వత్రిక కంపెనీగా నమోదైంది. కంపెనీకి హైదరాబాదు సంస్థానంలో వ్యాపారం కొనసాగించే వీలు ఫర్మాను కల్పించింది. ప్రారంభమైన రెండేళ్ళలోనే కంపెనీలో సింహభాగాన్ని బ్రిటీషు అమెరికన్ టొబాకో కంపెనీ కొనేసి, వజీర్ సుల్తాన్ వారసులకు కేవలం ఐదు శాతం వాటాను మాత్రమే మిగిల్చింది. తత్ఫలితంగా కంపెనీ పేరు వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీగా మారింది. 1970వ దశకపు తొలినాళ్లలో భారత ప్రభుత్వం ఫారిన్ ఎక్స్ఛేంజ్ రెగ్యులేషన్ చట్టం (ఫెరా) క్రిందకు వచ్చే కంపెనీలన్నింటికీ, తమ కంపెనీలలో విదేశీ వాటా 40 శాతం లోపు తగ్గించుకోవాలని ఆదేశించింది. తదనంతరం విఎస్‌టిలో బ్రిటీషు అమెరికన్ టొబాకో కంపెనీ వాటా 32.6 శాతానికి పడిపోయింది.[6]

1979లో హాల్‌మార్క్ టొబాకో కంపెనీని కొని, తన ఉత్పాదక మరియు విక్రయాల సబ్సిడరీగా మార్చింది. 1983 ఏప్రిల్ 30న కంపెనీ పేరును ప్రస్తుతమున్న విఎస్‌టి పరిశ్రమలు లిమిటెడ్‌గా మార్చుకొన్నది. అతి పెద్ద ఆధునీకరణ ప్రయత్నంలో భాగంగా 1988లో ఉత్పాదక సాంకేతికత ఆధునీకరించడానికి ప్రాన్స్ నుండి దిగుమతి చేసుకున్న హైస్పీడ్ ప్రిసెషన్ లోగా మాక్స్ సిగరెట్ యంత్రాలను స్థాపించింది. యునైటెడ్ కింగ్డమ్ కు చెందిన బ్రిటీష్ అమెరికన్ టొబాకో కంపెనీ, విఎస్‌టి పరిశ్రమల యొక్క అతిపెద్ద వాటాదారు.[7]

ఆ తరువాత భారతీయ కంపెనీల చట్టం 1956 క్రిందకి వచ్చింది. విఎస్‌టి యొక్క నమోదైన కార్యాలయం హైదరాబాదులోని ఆజమాబాదులో ఉంది.[1][4]

మార్కెట్[మార్చు]

కంపెనీ యొక్క మార్కెట్ విలువ 844.49 మిలియన్లు, PE Value: 15.70 and Dividend: 5.49. 2011లో కంపెనీ 450% డివిడెండును ప్రకటించి, బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీలో అత్యంత లాభాలను పంచిపెట్టే స్టాకుల్లో ఒకటిగా నిలిచింది.

విఎస్‌టి అనేక బ్రాండు పేర్లతో తన పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తుంది. వాటిలో చార్మినార్ స్పెషల్స్, షాహీ డెక్కన్, ఖిలా, హైకోర్ట్, వజీర్ అంబాసిడర్, ఛార్మ్స్ ఏస్ మరియు విజయ్ మాగ్నా కొన్ని ముఖ్యమైనవి. మొత్తం అమ్మకాలలో 40% దిగువ శ్రేణి మార్కెట్ నుండి వస్తున్నాయి, ప్రధానంగా ఛార్మినార్ ప్లెయిన్స్ మరియు ఛార్మినార్ స్టాండర్డ్ సిగరెట్లు.[7]

విఎస్‌టికి అజమాబాదులో ఒక సిగరెట్ల కర్మాగారం ఉంది. ఈ కర్మాగారం యొక్క ఉత్పాదక సామర్ధ్యం సాలీనా 24,572 మిలియన్ సిగరెట్లు. ఎయిర్ క్యూరుడ్ పొగాకులోనూ చుట్టలు నింపే పొగాకు ఎగుమతుల్లో కంపెనీకి ప్రీమియర్ స్థానం ఉంది. 2005లో షాన్ అనే ఒక కొత్త మైక్రో బ్రాండును ప్రారంభించింది. మొత్తం ఆదాయంలో 94% సిగరెట్ల అమ్మకాలనుండి రాగా, మిగిలిన ఆరు శాతం పొగాకు ఎగుమతుల నుండి వచ్చింది.[7]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 ఎకనామిక్ టైమ్స్ పత్రికలో వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీ యొక్క కాలరేఖ మరియు చరిత్ర
  2. http://www.vsthyd.com/i/VST%20AR%202010_Report%20on%20Corporate%20Governance.pdf
  3. http://www.vsthyd.com/i/Financial%20Results%20for%20the%20year%20Ended%2031st%20March,%202011.pdf
  4. 4.0 4.1 http://www.vsthyd.com/aboutus.html
  5. http://www.india-today.com/itoday/19991206/business.html
  6. H, Hemnath Rao (2004). "VST Industries Limited: Strategic Responses to Globalization" (PDF). ASCI Journal of Management 3. Administrative Staff College of India. 33 (1&2): 37–51. Retrieved 3 March 2014. line feed character in |title= at position 47 (help)
  7. 7.0 7.1 7.2 విఎస్‌టి పరిశ్రమలపై డన్&బ్రాడ్‌స్త్రీట్ సంస్థ యొక్క క్లుప్త నివేదిక