వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2015 41వ వారం
స్వరూపం
బురఖా |
---|
బురఖా అనేది కొందరు స్త్రీలు తమ వస్త్రాలపైన ధరించే ముసుగు. దీనికి "హిజాబ్" అనే అరబిక్ పదం "కప్పుకొనుట" అనే అర్ధం కలిగి ఉంది. బురఖాను అధికంగా తమ మత సంప్రదాయానుసారం ముస్లిం స్త్రీలు ధరిస్తారు. ముస్లింలలోనే గాక, గౌరవం, సాంప్రదాయం, సిగ్గు, మొదలగు వాటిని ఆచరించే వారు, ఈ సంప్రదాయాన్ని, దేశం, మతం, భాష, ప్రదేశం అనే తారతమ్యాలు లేకుండా ఆచరించే వారు కోకొల్లలుగా కనిపిస్తారు. వారు ఈ పరదా పద్దతిని అనుసరించి తల మరియు భుజాలపైనుండి ధరించే వస్త్రాలను, దుపట్టా, డుపట్టా, ఓణీ, ఓఢ్‌నీ, ఓణ్ణీ, చున్నీ, చునరీ, చాదర్, చద్దర్, స్కాఫ్ మరియు ఖిమార్ మొదలగు పేర్లతో పిలుస్తారు. ఇస్లామీయ సాహిత్యంలో హిజాబ్ అనగా గౌరవంతో కూడిన హుందాతనం, వ్యక్తిగతం, మరియు సద్-నీతి.ఈ పదము ఖురాన్ లో, తలపై కప్పుకునే వస్త్రం కొరకు ఉపయోగించబడినది. ప్రపంచంలోని పలు దేశాలలో పలు విధాలుగా ముస్లిం స్త్రీలు 'హిజాబ్', 'నఖాబ్', 'జిల్బాబ్' ను ధరిస్తారు. బురఖా భారతీయ, అఫ్ఘానీ, ఇరాకీ మరియు ఇరాన్ సంస్కృతికి చిహ్నం. భారతీయ సంతతికి చెందినవారు ఎక్కడవున్నా నల్లని బురఖాలో దర్శనమిస్తారు.బురఖా నిర్బంధమని ఇస్లాం చెప్పలేదు కానీ పవిత్ర ఖురాన్‌లో ఈ ప్రస్తావన ఉంది. దీనిని హిజాబ్ (అడ్డుతెర) అనికూడా అంటారు. ముస్లిం మహిళ పర పురుషుల చెడు చూపుల నుంచి తనను తాను రక్షించుకొనేందుకు బురఖాను ధరించమని ప్రవక్త సూచించారు. (ఇంకా…) |