వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2016 02వ వారం
Appearance
యల్లాప్రగడ సుబ్బారావు |
---|
యల్లాప్రగడ సుబ్బారావు (జనవరి 12, 1895 - ఆగష్టు 9, 1948) భారత దేశమునకు చెందిన వైద్య శాస్త్రజ్ఞులలో చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. లెడర్లీ ప్రయోగశాలలో వైద్యబృందం నాయకులుగా ఫోలిక్ ఆమ్లం యొక్క నిజస్వరూపాన్ని కనుగొన్నాడు. అందులోని బంగారు వన్నె భస్మం స్ప్రూ వ్యాధి, మక్రోసైటిక్ అనీమియా అను రక్తహీనత వల్ల కలిగే వ్యాధి నిర్మూలనకు అసమానమైన, అద్భుతమైన మందుగా నిర్ణయింపబడింది. క్షయరోగ నివారణియగు బసోనికోటి నికాసిడ్, హైడ్రాక్సైడ్ మందులను కనుగొన్నారు. బోదకాలు, టైఫాయిడ్, పాండురోగం మున్నగు వ్యాధులకు పూర్తిగా నిర్మూలింపగల మందులను కనుగొన్నాడు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బస్తీలో 1895 , జనవరి 12 న జన్మించారు. తండ్రి పేరు జగన్నాథం. ఎలిమెంటరీ, ఉన్నత పాఠశాల చదువులు పుర్తి చేసేటప్పటికి తండ్రి చిరు ఉద్యోగిగానే రిటైర్ అయ్యాడు. ఇక, ఈయనను చదివించడానికి తండ్రి వెనుకంజ వేయగా తల్లి పట్టుబట్టి ఈయనను రాజమండ్రి కి పంపించి మెట్రిక్యులేషన్ పరీక్ష చదివించారు. ఫెయిలయ్యారు. ఇంతలో తండ్రి మరణించాడు. తల్లి పట్టుదలతో మద్రాసు కు పంపదల్చగా చేత చిల్లిగవ్వ లేదు. పుస్తెలు అమ్మి కొడుకు చదువుకు ఇచ్చింది. మద్రాసు హిందూ ఉన్నత పాఠశాల లో చేరి, చదువులో ముందడుగు వేశాడు. (ఇంకా…) |