Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2016 09వ వారం

వికీపీడియా నుండి

లినొలిక్ ఆమ్లం

లినొలిక్ ఆమ్లం అనునది నూనెలలో, కొవ్వులలో గ్లిసరైడు/గ్లిజరాయిడ్ రూపంలో లభించు ఒక అసంతృప్త కొవ్వు ఆమ్లం. కొవ్వు ఆమ్లాలను మోనోకార్బోక్సిల్ ఆమ్లమని అని కూడా ఆంటారు. ఎందుకనగా కొవ్వుఆమ్లం యొక్క ఉదజని-కర్బన శృంఖలం/గొలుసులో ఒక చివర మిథైల్ (CH3) ఉండగా, రెండో చివర ఒక కార్బోక్సిల్ ( -C(=O)OH లేదా -COOH) సమూహం మాత్రమే వుండటం వలన మోనో కార్బోక్సిల్ ఆమ్లాలని అంటారు. లొనొలిక్ ఆమ్లం ఒక ఆవశ్యక కొవ్వు ఆమ్లం. లినొలిక్ అనుపదం గ్రీకు పదమైన లినొన్ నుండి పుట్టినది. లినొన్ అనగా జనుము మరియు ఒలిక్ అనగా నూనెలకు కు సంబంధించిన లేదా వాటినుండి ఏర్పడినదని అర్థం. లినొలిక్ ఆమ్లాన్ని 1923 లో ఆవశ్యక మైన పోషక పదార్థంగా గురించి, దానిని విటమిన్ 'ఎఫ్'గా వర్గీకరించారు. తిరిగి 1930 లో దీనిని నూనెలు, కొవ్వుఆమ్లాలలో చేర్చి ముఖ్యమైన మూడు ఆవశ్యక కొవ్వుఆమ్లాలలో ఒకటిగా గుర్తించారు. మిగిలిన రెండు లినొలెనిక్ అమ్లం మరియు అరచిడిక్ ఆమ్లం. లినొలెనిక్ కొవ్వుఆమ్లాన్ని ఒమేగా-3 కొవ్వుఆమ్లమని కూడా పిలుస్తారు. ఈ ఆమ్లం జీవసంశ్లేషణ ద్వారా దేహవ్యవస్థలో ప్రోస్టగ్లాండినులను ఏర్పరచుతుంది మరియు కణపొరల నిర్మాణంలో భాగం వహిస్తుంది. ఇది స్టియరిక్ ఆమ్లం, జీవ ఇంథనం, సబ్బులు మరియు క్రీములు తయారుచేయుటకు ఉపయోగపడుతుంది. జీవ ఇంధనం తయారు చేయవచ్చును.

(ఇంకా…)