వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2016 15వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గోలియత్ పక్షి భక్షిణి సాలీడు

గోలియత్ పక్షి భక్షిణి అనే జీవి ఒక రకమైన సాలీడు. ఇది "టారంటులా" కుటుంబానికి, "థెరస్పోసిడె" వర్గానికి చెందినది. ఇది ప్రపంచంలో రెండవ అతి పెద్ద సాలీడు. మొదటి స్థానంలో గలది "రాకాసి వేట సాలీడు". ఇది బరువు లో అతి పెద్ద సాలీడు కావచ్చు. దీనిని "గోలియత్ పక్షి భక్షిణి సాలీడు" అని కూడా పిలుస్తారు. దీనిని 18 వ శతాబ్దంలో "మారియా సైబిలా మెరియన్" అనే వ్యక్తి హమ్మింగ్ బర్డ్ ను తినుచుండగా పరిశీలించి దీనిని "థెరఫోసైడ్స్" "పక్షి భక్షిణి" అని పిలిచాడు. ఇవి ఎక్కువగా అమెరికా అడవుల్లో ఉండే ఈ రాకాసి సాలీళ్ళు. దీని ఒంటి నిండా వెండ్రుకలు ఉంటాయి. ఇవి వాటిని ఎదుటి జీవి పైకి బాణాల్లాగా విసరగలదు. ఆ వెండ్రుకలు గుచ్చుకుంటే ఏ జీవైనా విలవిల్లాడాల్సిందే. ఇది ఎనిమిది కాళ్లనూ విప్పిందంటే 12 అంగుళాల స్థలాన్ని ఆక్రమిస్తుంది. ఇది అన్ని సాలీళ్లలాగా గూడు కట్టదు. బొరియల్లో జీవించే దీనికి ఎనిమిది కాళ్లతో పాటు ఎనిమిది కళ్లుంటాయి. రెండు కోరలు కూడా ఉంటాయి. ఒక్కొక్కటీ అంగుళం పొడవుంటే ఈ కోరల్లో విషం ఉంటుంది. వీటితో గుచ్చిందంటే ఇక ఆ జీవి కదల్లేదు. ఇవి పాములు, పక్షులు, కప్పలు, తొండల్లాంటి జీవులపై అమాంతం దూకి కోరలతో కాటేస్తాయి. ఆ విషం వల్ల వాటి శరీరంలో కండరాలన్నీ మెత్తగా అయిపోతాయి. అప్పుడు ఆ సారాన్ని ఇది పీల్చేస్తుందన్నమాట. దీనికి ఇంకో విద్య కూడా ఉంది. వెంట్రుకలతో ఉన్న కాళ్లను ఒకదానికి ఒకటి రుద్దిందంటే 'హిస్స్‌స్‌స్‌...' అనే శబ్దం వస్తుంది.

(ఇంకా…)