వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2016 27వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం, బలిజిపేట

శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం విజయనగరం జిల్లా, బలిజిపేట లోని ఒక ప్రాచీన దేవాలయం. ఇక్కడ శ్రీ వేంకటేశ్వరస్వామి వారు చిరకాలంగా భక్తుల కోర్కెలను తీర్చుతూ కొలువైయున్నారు.ఈ దేవస్థానం 1869 సంవత్సరంలో బరిగెడ రామస్వామి గారి సుపుత్రులు బరిగెడ చిన్న నరసయ్య గారిచే శుక్ల నామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ ఏకాదశి రోజున ప్రతిష్టించబడినది. ప్రతి సంవత్సరం ఈ రోజున ఇక్కడ స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించబడుతుంది. ఆనాడు చిన్న నరసయ్యగారు ప్రధాన దేవతామూర్తులైన వేంకటేశ్వర స్వామి, ఆండాళ్ మరియు జగన్నాధ స్వామి, బలభద్రుడు మరియు సుభద్ర దేవుల విగ్రహాల ప్రతిష్ట చేశారు.1927 లో వీరి మనుమడైన బరిగెడ నరసయ్య గారు కాశీయాత్ర చేసి గరుడాళ్వార్ విగ్రహ ప్రతిష్ట చేశారు. ఆనాడే ధ్వజ స్తంభాన్ని కూడా రంగూన్ నుండి తెప్పించి స్థాపించారు.1956 లో బరిగెడ నరసయ్య గారి ధర్మపత్ని రావింజమ్మ గారు దేవాలయానికి మొదటిసారిగా విద్యుత్తు కనెక్షన్ ఇప్పించారు. తర్వాత చిన్నవీధిలోని ఒక ముత్తైదువ దానమిచ్చిన ధనసహాయంతో నుయ్యిని తవ్వించి పూలతోటను వేయించారు.1969 లో నరసయ్య గారి ఆధ్వర్యంలొ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆ కాలంలోనే పన్నిద్దరాళ్వారుల ప్రతిష్ట జరిగింది. ఈ విగ్రహాలను విజయవాడ నుండి తెప్పించారు. శ్రీవారి విమానం చుట్టూ దశావతారాల్ని శిల్పులచే చెక్కించారు.

(జూలై 6 2016-"జగన్నాథ రథయాత్ర" సందర్భంగా...)

(ఇంకా…)