Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2016 45వ వారం

వికీపీడియా నుండి

ఆపరేషన్ ఎంటెబ్బె

ఎంటెబ్బె ఆపరేషన్ ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడిఎఫ్) విజయవంతంగా జరిపిన ఉగ్రవాద వ్యతిరేక చర్య. ఈ ఆపరేషన్ 1976 జూలై 4 న ఉగాండా లోని ఎంటెబ్బె విమానాశ్రయంలో జరిగింది. అంతకు ఒక వారం ముందు జూన్ 27న, ఎయిర్ ఫ్రాన్స్‌కు చెందిన విమానాన్ని పాపులర్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్టైన్ - ఎక్స్‌టర్నల్ ఆపరేషన్స్ (PFLP-EO) అనే సంస్థకు చెందిన ఇద్దరు సభ్యులు వాదీ హద్దాద్ ఆదేశానుసారం, జర్మన్ రివల్యూషనరీ సెల్స్ కు చెందిన ఇద్దరు సభ్యులతో కలిసి హైజాక్ చేసారు. 240 మంది ప్రయాణీకులను బందీలుగా పట్టుకున్నారు. బందీల విడుదల జరగాలంటే ఇజ్రాయిల్ జైళ్ళలో ఉన్న పాలస్తీనా మరియు సంబంధిత ఉగ్రవాదులు 40 మందిని, మరి నాలుగు ఇతర దేశాల్లో ఖైదీలుగా ఉన్న 13 మంది ఉగ్రవాదులనూ విడిపించాలని షరతు విధించారు. ఇజ్రాయిల్లోని టెల్ అవీవ్ లో బయల్దేరి పారిస్ వెళ్ళవలసిన విమానం, దారిలో ఏథెన్స్ లో ఆగి, తిరిగి బయల్దేరింది. దారిలో హైజాకర్లు దాని దారి మళ్ళించి, బెంఘాజి మీదుగా ఉగాండాకు చెందిన ఎంటెబ్బెకు తరలించారు. ఉగాండా ప్రభుత్వం హైజాకర్లకు మద్దతు పలికింది. ఉగాండా అధ్యక్షుడు, ఇదీ అమీన్ స్వయంగా వారికి స్వాగతం పలికాడు. బందీలను విమానం నుండి విమానాశ్రయం లోని ఒక ఖాళీ భవనంలోకి తరలించి, వారిలో ఇజ్రాయిలీలను, ఇజ్రాయిలేతరులైన యూదులనూ విడదీసి వారిని వేరే ఒక గదిలోకి తరలించారు.

(ఇంకా…)