Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2016 47వ వారం

వికీపీడియా నుండి

ఆంధ్రప్రదేశ్ తోలు బొమ్మలాట

తోలుబొమ్మలాట అనేది భారత దేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జానపద కళారూపం. ఈ తోలుబొమ్మలాటలో చర్మంతో చేసిన వివిధ బొమ్మలతో ఒక కథని తయారుచేసి గ్రామాలలో కళారూపంగా ప్రదర్శిస్తారు. ప్రస్తుత కాలంలో పురాణ గాథలైన రామాయణం, మహాభారతం లోని కొన్ని కథలను టెలివిజన్ లో చూస్తూ ఉంటాము. కానీ పూర్వ కాలంలో మారుమూల గ్రామాలలోని ప్రజలకు ఈ గాథలను తెలియజెప్పే సాధనాలు లేవు. ఆ కాలంలో ఆ కథలను అర్థవంతంగా తెలియజెప్పేందుకు ఈ కళాకారులు వివిధ రకాల పాత్రల యొక్క బొమ్మలను చేసి వాటిని ప్రదర్శించేవారు. తోలుబొమ్మలాట అనగా తోలుతో చేసిన బొమ్మలతో నాట్యం చేయించుట. పల్లె వాసులకు వినోదాన్ని పంచి పెట్టిన అతి ప్రాచీన కళల్లో తోలుబొమ్మలాటలు మొదటిది. హరికథలు, బుర్రకథలు, వీధి నాటకాలు మొదలగు వాటి ఉనికి లేనప్పుడే ఈ తోలుబొమ్మలాటలు పల్లెవాసుల కందుబాటు లోకి వచ్చాయి. బహుళ ప్రచారం పొందాయి. ఈనాడు ఆంధ్రదేశంలో ఈ తోలుబొమ్మలాటల్ని, బుట్టబొమ్మలాటల్ని, కొయ్య కావళ్ళవారి ప్రదర్శనలనూ అతి అరుదుగా చూస్తూ వున్నాం. కాని కొయ్య బొమ్మలాటల్ని మాత్రం ఎక్కడా చూడలేక పోతున్నాం. ఈ ఆట క్రీ.శ. 1700 కాలంలో తోలుబొమ్మలాటలు ఆంధ్రదేశంలో ఎక్కువగా ప్రదర్శింపబడుతుండేవి.

(ఇంకా…)