వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2018 49వ వారం
రాజేంద్ర ప్రసాద్ భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రపతి. ఈయన 1950 నుండి 1962 వరకు రాష్ట్రపతి భాద్యతలను నిర్వహించాడు. ప్రజలు ఇతనిని ప్రేమగా, గౌరవంగా బాబూ అని పిలిచేవారు. స్వాతంత్ర్యోద్యమ కాలంలో భారత జాతీయ కాంగ్రెస్ లో చేరి బీహార్ లో ప్రముఖ నాయకునిగా ఎదిగాడు. మహాత్మాగాంధీ మద్దతుదారునిగా ఆయన 1931 లో జరిగిన ఉప్పు సత్యాగ్రహం, 1941లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొని జైలుశిక్ష అనుభవించాడు. 1946 ఎన్నికల తరువాత ఆహారం, వ్యవసాయం శాఖకు భారత ప్రభుత్వం కేంద్రమంత్రిగా వ్యవహరించాడు. 1948 నుండి 1950 వరకు భారత రాజ్యాంగ ముసాయిదా తయారీ కోసం ఏర్పరచబడిన సంఘానికి అధ్యక్షత వహించాడు. 1950లో భారతదేశం గణతంత్ర రాజ్యంగా అవతరించిన తరువాత అతడు రాజ్యాంగ పరిషత్తు ద్వారా మొదటి రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డాడు. 1951 సార్వత్రిక ఎన్నికల తరువాత మొదటి భారత పార్లమెంటు ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డాడు. ఒక రాష్ట్రపతిగా పక్షపాత ధోరణి లేకుండా, ఉన్నత పదవులలో ఉన్నవారు స్వతంత్రంగా వ్యవహరించేందుకుగాను కాంగ్రెస్ పార్టీ రాజకీయాల నుండి వైదొలగి కొత్త సాంప్రదాయాన్ని నెలకొల్పాడు. ఈ పదవి అలంకారప్రాయమైనదైనప్పటికీ అతడు భారతదేశంలో విద్యాభివృద్ధికి ప్రోత్సహించేందుకు గాను అప్పటి ప్రధానమంత్రి జవాహర్ లాల్ నెహ్రూ కు వివిధ సందర్భాలలో సలహాలనిచ్చేవాడు.
(ఇంకా…)