వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2019 18వ వారం
సాల్‌సీడ్ నూనె సాలువా చెట్టు గింజలనుండి తీయబడుతున్న ఆహారయోగ్యమైన శాకనూనె. సాలువా చెట్టు గింజలలోని తైలం 45-50% వరకు సంతృప్త కొవ్వు ఆమ్లాలను కలిగివుండటం వలన 30-350C వద్ద ఘనీభవించును. అందుచే దీనిని సాల్ ఫ్యాట్ లేదా సాల్ బట్టరు అంటారు. సాల్/సాలువ/సాల్వ చెట్టు యొక్క వృక్ష శాస్త్రీయనామం: షోరియ రొబస్టా. ఇది యిదిడిప్టెరోకార్పేసి కుటుంబానికి చెందినది. ఉత్తర భారతదేశంలో మరియు హిందీలో ఈ వృక్షాన్ని సాల్, సాల్వా, రాల్, సాఖు, షాల్ అని పిలుస్తారు. సంస్కృతంలో 'అశ్వకర్ణ' అని, తెలుగులో సాలువ, సాల్వ అని పిలుస్తారు. సాల్వ వృక్షం బౌద్ధులకు ఎంతో పవిత్రమైనది. బుద్ధుని జననం మరణం సాల్వ వృక్షం క్రింద జరిగిందని వారి విశ్వాసం.ఇదే కుటుంబానికి చెందినావాటిక రొబస్టా అనే మరోమొక్కను గుగ్గిలం అంటారు.సాలువా మొక్కను గుగ్గిలం అని కుడా వ్యవహరిస్తారు. సాల్వవృక్షం 30-35 మీటర్ల ఎత్తు పెరుగును. బలమైన కాండం, శాఖలు కలిగి వుండును. పెరిగిన చెట్టు కాండం వ్యాసం 1.5-2.0 మీ, వుండును. పెరుగుచున్న చెట్టుబెరడు గోధుమ వర్ణంలోవుండి, నిలువుగా చీలికలుండి,4-5సెం, మీ. మందముండును. ఆకులు (పత్రాలు) 15-20 సెం, మీ, వుండును. ఈ నూనెను చాక్‌లెట్ తయారిలో, వనస్పతి తయారిలో సాల్ కొవ్వును వాడెదరు. సబ్బులతయారిలో కూడా వినియోగిస్తారు. సాల్ చెట్టు నుండి కలపను దూలలు, కిటికి, గుమ్మాల ఫ్రేములు తయారుచేయుదురు. టేకు, దేవదారు తరువాత అంతగా దృఢమైనది సాలువ కలప.
(ఇంకా…)