వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2019 31వ వారం
Appearance
ఫాస్పారిక్ ఆమ్లం |
---|
ఫాస్పారిక్ ఆమ్లం ఒక అకర్బన, ఖనిజ ఆమ్లం. దీనిని అర్థోఫాస్పారిక్ ఆమ్లం అనికూడా అంటారు. ఫాస్పారిక్ ఆమ్లం రసాయన ఫార్ములా H3PO4. ఫాస్పర్ (భాస్వర౦) హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ పరమాణువుల సంయోగం వలన ఈ ఆమ్లం ఏర్పడినది. అర్థోఫాస్పారిక్ ఆమ్లం అనుపేరు ఈ ఆమ్లం యొక్క శాస్త్ర నామం. అర్థో అను పూర్వపదం, ఈ ఆమ్లాన్ని మిగతా పాలిఫాస్పారిక్ ఆమ్లాలకన్నా వేరుగా గుర్తించుటకు పెట్టారు. అర్థోఫాస్పారిక్ ఆమ్లం విష గుణం లేని ఆమ్లం. సాధారణ గది ఉష్ణోగ్రత మరియు పీడనం వద్ద శుద్ధమైన ఫాస్పారిక్ ఆమ్లం ఘనస్థితిలో ఉండును. ఫాస్పారిక్ ఆమ్లం ఒక రసాయన పదార్థంగా ఉపయోగపడటం కాకుండా ఇతర పలు ఉపయోగాలు కల్గి ఉంది. దీనిని తుప్పు తొలగించుటకు/నిరోధించుటకు, ఆహారంలో ఆదరువుగా , ఎలక్ట్రోలైట్‌గా, ఎరువులలో, గృహశుద్ధీకరణ పదార్థాలలో అంశిభూతంగా ఉపయోగిస్తారు. జీవశాస్త్రలో కుడా ఫాస్పారిక్ ఆమ్లం మరియు ఫాస్పేట్‌లు సముచితస్థానం కల్గిఉన్నది. ఫాస్పారిక్ ఆమ్లం సాధారణంగా 85% గాఢత కల్గిన ద్రవరూపంలో లభిస్తుంది. సజల ద్రావణరూప ఫాస్పారిక్ ఆమ్లం రంగు మరియు వాసన లేని ఆమ్లం. 85% గాఢత కల్గిన ఆమ్లం చిక్కని తియ్యగా నుండు ద్రవం. ఫాస్పారిక్ ఆమ్లం బలమైన ఆమ్లం కావున వస్తువులను క్షయించు లక్షణం కల్గి ఉంది. ఇది కాస్మటిక్స్ మరియు చర్మసంరక్షక ఉత్పత్తులలో పి.హెచ్ ను తగిన స్థితిలో ఉంచు పదార్థంగా వాడెదరు. (ఇంకా…) |