వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2020 02వ వారం
స్వరూపం
కె. జె. ఏసుదాసు |
---|
కట్టస్సేరి జోసెఫ్ యేసుదాస్ భారతీయ శాస్త్రీయ సంగీత కళాకారుడు, భారతీయ సినిమా నేపధ్య గాయకుడు. అతను భారతీయ శాస్త్రీయ, భక్తి మరియు సినిమా పాటలు పాడాడు. అతను తన ఐదు దశాబ్దాల కళా జీవితంలో వివిధ భారతీయ భాషలైన మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, బెంగాలీ, ఒరియా భాషలతో పాటు అరబిక్, ఆంగ్లం, లాటిన్, రష్యన్ భాషలలో సుమారు 80వేల పాటలను పాడాడు. అతనిని గాన గంధర్వన్ గా కూడా పిలుస్తారు. అతను అత్యంత బహుముఖ, ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఇండియన్ సింగర్ గా పరిగణించబడ్డాడు . అతను భారతీయ భాషలలో పంజాబీ, అస్సామీ, కొంకణి, కాశ్మీరీ భాషలు తప్ప అన్ని భారతీయ భాషలలో కూడా పాటలు పాడాడు. అతను 1970 మరియు 1980 లలో అనేక మలయాళ చలనచిత్ర పాటలను కూడా కూర్చాడు. అతను ఉత్తమ పురుష నేపధ్య గాయకునిగా జాతీయ పురస్కారాలను ఎనిమిది సార్లు, దక్షిణాది పిలిం ఫేర్ పురస్కారాలను ఐదు సార్లు, ఉత్తమ నేపధ్య గాయకునిగా రాష్ట్ర పురస్కారాన్ని నలభై మూడు సార్లు అందుకున్నాడు. అతను 1975లో పద్మశ్రీ పురస్కారాన్ని, 2002లో పద్మ భూషణ్ పురస్కారాన్ని, 2017లో భారత రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ ను కూడా అందుకున్నాడు. (ఇంకా…) |