వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2020 07వ వారం
Jump to navigation
Jump to search
పిల్ట్‌డౌన్ మనిషి |
---|
పిల్ట్‌డౌన్ మనిషి ఒక పాలియో ఆంత్రోపోలాజికల్ మోసం. కొన్ని ఎముకల శకలాలను, అప్పటికి ఇంకా తెలియని తొలి మానవుడి శిలాజ అవశేషాలుగా చూపించిన బూటక కథనం ఇది. 1953 లో అది మోసం అని తేల్చారు. 2016 లో జరిపిన విస్తృతమైన శాస్త్రీయ సమీక్షలో, ఈ బూటక వ్యవహారానికి కారకుడు ఔత్సాహిక పురావస్తు శాస్త్రవేత్త చార్లెస్ డాసన్ అని తేలింది. 1912 లో వాలిడికి (తోక లేని కోతి), మనిషికీ మధ్య "తప్పిపోయిన లింకు"ను కనుగొన్నానని చార్లెస్ డాసన్ పేర్కొన్నాడు. 1912 ఫిబ్రవరిలో అతడు, నేచురల్ హిస్టరీ మ్యూజియంలోని భూగర్భశాస్త్ర కీపర్ ఆర్థర్ స్మిత్ వుడ్‌వర్డ్‌ను సంప్రదించాడు. తూర్పు సస్సెక్స్‌లోని పిల్ట్‌డౌన్ సమీపంలో ఉన్న ప్లైస్టోసీన్ కాలపు కంకర పొరలో మానవుడి పుర్రె భాగం లాంటి దాన్ని కనుగొన్నానని చెప్పాడు. ఆ వేసవిలో, డాసన్, స్మిత్ వుడ్‌వర్డ్ ఈ ప్రదేశంలో మరిన్ని ఎముకలు, కళాకృతులను కనుగొన్నారు. అవన్నీ ఒకే వ్యక్తికి చెందినవిగా వాళ్ళు భావించారు. వీటిలో దవడ ఎముక, ఎక్కువ పుర్రె శకలాలు, దంతాల సమితి, ఆదిమ కాలపు పనిముట్లూ ఉన్నాయి. స్మిత్ వుడ్‌వర్డ్ పుర్రె శకలాలను పునర్నిర్మించాడు. అవి 5,00,000 సంవత్సరాల క్రితం నాటి మానవ పూర్వీకుడికి చెందినవని ప్రతిపాదించాడు. (ఇంకా…) |