వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2020 10వ వారం
Jump to navigation
Jump to search
హిందూ కుష్ |
---|
హిందూ కుష్ 800 కిలోమీటర్ల పొడవైన (500 మైళ్ళు) పర్వత శ్రేణి. ఇది ఆఫ్ఘనిస్తాన్ అంతటా విస్తరించి ఉంది. ఇది దాని కేంద్రం నుండి ఉత్తర పాకిస్తాన్, తజికిస్తాన్ వరకు విస్తరించి ఉంది. హిందూ కుష్ పదానికి పర్షియా భాషలో హిందూ హంతకులు లేదా హిందువుల హంతకుడు అని దీనికి అర్ధం. ఇది పామీరు పర్వతాలు, కారకోరం పర్వతశ్రేణితో కూడిన హిమాలయాల పశ్చిమ విస్తరణగా ఉంది. ఇది సింధు నది లోయ నుండి అము దర్యా (పురాతన ఆక్సస్) లోయ ఉత్తర ప్రాంతాలను విభజిస్తుంది. ఈ శ్రేణిలో మంచుతో కప్పబడిన అనేక శిఖరాలు ఉన్నాయి. పాకిస్తాన్ లోని ఖైబరు పఖ్తున్ఖ్వాలోని చిత్రాలు జిల్లాలో 7,708 మీటర్లు (25,289 అడుగులు) ఎత్తులో తిరిచు మీరు లేదా టెరిచ్మిరు వంటి హిమశిఖరాలు ఉన్నాయి. ఉత్తరాన, దాని ఈశాన్య సరిహద్దున చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులు కలిసే ప్రదేశానికి సమీపంలో హిందూ కుష్ పామీరు పర్వతాలు ఉన్నాయి. తరువాత ఇది పాకిస్తాన్ గుండా నైరుతి దిశగా విస్తరించి పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ వరకు వెళుతుంది. ఉత్తర హిందూ కుష్ తూర్పు కారకోరం శ్రేణితో విలీనం అవుతుంది. దాని దక్షిణ చివరలో ఇది కాబూల్ నదికి సమీపంలో ఉన్న స్పిన్ఘరు శ్రేణితో కలుస్తుంది.. (ఇంకా…) |