వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2020 20వ వారం
స్వరూపం
ఆవశ్యక నూనె |
---|
ఆవశ్యక నూనెలు అనేవి మొక్కల నుండి, చెట్లనుండి ఉత్పత్తిచేయు నూనెలు. ఆవశ్యక నూనెలలో అత్యధిక భాగం మొక్కల/చెట్ల భాగాలనుండి అనగా ఆకులు, వేర్లు, కాండాల బెరడు, కాండం, పూమొగ్గలు, పూలరెమ్మలు, పళ్ల పైనున్న తొక్కలు వంటి వాటిలో లభించును. అతితక్కువగా కొన్ని రకాల ఆవశ్యక నూనెలను విత్తానాల నుండి తీయుదురు. వీటిని నూనెలని వ్యవహరించినను వీటిలో కొవ్వు ఆమ్లాలు వుండవు. ఆవశ్యక నూనెలు జలవికర్షణ లక్షణం కలిగి, నూనెలలో, హైడ్రొకార్బను ద్రావణులలో కరుగు లక్షణాలు కలిగి వుండును. ఆవశ్యక నూనె లన్నియు సువాసన కలిగిన నూనెలే. ప్రతి ఆవశ్యక నూనె తనకంటూ ఇక ప్రత్యేక వాసన కలిగి వుండును. ఆవశ్యక నూనెలలో ఒకటి రెండు మినగా యించి మిగతా నూనెలన్నియు తక్కువ బాష్పికరణ/మరుగు ఉష్ణోగ్రత వున్న నూనెలే.తక్కువ ఉష్ణోగ్రత వద్దనే బాష్పీకరణ చెందు ద్రవాలను ఒలటైలులు అంటారు. ఆవశ్యకనూనెలను మొక్కల/చెట్ల యొక్క ఎసెన్సు లు అని కూడా అంటారు. ఆవశ్యక నూనెలు సువాసన భరితాలు కావటం వలన అనాదిగా వీటిని సువాసన/సుగంధ ద్రవ్యాలు/నూనెలుగా, సౌందర్య లేపనాలలో/నూనెలలో విరివిగా వాడెవారు. (ఇంకా…) |