వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2020 21వ వారం
స్వరూపం
గ్రీన్‌హౌస్ వాయువు |
---|
గ్రీన్‌హౌస్ వాయువు ఉష్ణ పరారుణ పరిధి లోపల వికిరణశక్తిని గ్రహించి, విడుదల చెయ్యగల వాయువు. గ్రీన్‌హౌస్ వాయువులు గ్రహాలపై గ్రీన్‌హౌస్ ప్రభావాన్ని కలిగిస్తాయి. భూ వాతావరణంలో ప్రాథమిక గ్రీన్‌హౌస్ వాయువులు నీటి ఆవిరి (H2O), కార్బన్ డయాక్సైడ్ (CO2), మీథేన్ (CH4), నైట్రస్ ఆక్సైడ్ (N2O), ఓజోన్ (O3) లు. గ్రీన్‌హౌస్ వాయువులు లేకపోతే, భూ ఉపరితలపు సగటు ఉష్ణోగ్రత ఇప్పుడున్న 15oC కాకుండా, -18oC ఉండి ఉండేది. శుక్రుడు, అంగారకుడు, టైటన్ ల వాతావరణాలలో కూడా గ్రీన్‌హౌస్ వాయువులు ఉన్నాయి. పారిశ్రామిక విప్లవం ప్రారంభం నుండి (1750 ప్రాంతాల్లో) మానవ కార్యకలాపాల వలన వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ సాంద్రత పెరుగుతూ వచ్చింది. 1750 లో 280 పిపిఎమ్ ఉన్న సాంద్రత 2019 లో 415 పిపిఎమ్ వరకు, 45%, పెరిగింది. ఇంత అధిక స్థాయిలో కార్బన్ డయాక్సైడ్ సాంద్రత ఎప్పుడో 30 లక్షల సంవత్సరాల క్రితం ఉండేది. ఆ తరువాత ఎప్పుడూ ఇంత ఎక్కువ స్థాయిలో లేదు కార్బన్ చక్రంలో ఉండే వివిధ ప్రకృతి సహజ "సింక్‌లు" ఈ ఉద్గారాలలో సగానికి పైగా పీల్చేసుకున్నప్పటికీ ఈ పెరుగుదల సంభవించింది. మానవజనిత కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలలో ఎక్కువ భాగం శిలాజ ఇంధనాలను దహనం చెయ్యడం వలన వచ్చినదే. వాటిలో ముఖ్యమైనవి: బొగ్గు, చమురు, సహజ వాయువు. (ఇంకా…) |