వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2020 36వ వారం
స్వరూపం
కల్నల్ సాండర్స్ |
---|
కల్నల్ హార్లాండ్ డేవిడ్ సాండర్స్ అమెరికన్ వ్యాపారవేత్త, ఫాస్ట్ ఫుడ్ చికెన్ రెస్టారెంట్ల శ్రేణి కెంటుకీ ఫ్రైడ్ చికెన్(KFC) ను స్థాపించాడు. తరువాత కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా, చిహ్నంగా పనిచేశాడు. అతని పేరు, చిత్రం ఇప్పటికీ కె.ఎఫ్.సి సంస్థకు చిహ్నాలుగా ఉన్నాయి. "కల్నల్" అనే బిరుదు గౌరవప్రదమైనది - కెంటుకీ కల్నల్ అనేది సైనిక హోదా కాదు. సాండర్స్ తన ప్రారంభ జీవితంలో ఆవిరి యంత్రాలకు బొగ్గులు వేసే ఉద్యోగంలో, ఇన్సూరెన్స్ అమ్మకం దారుగా, ఇంధనాన్ని నింపే కేంద్రంలో పనివాడిగా అనేక ఉద్యోగాలను చేసాడు. అతను ఆర్థిక మాధ్యం సమయంలో కెంటుకీలోని నార్త్ కార్బిన్‌లోని రోడ్డు ప్రక్కన రెస్టారెంట్ ను నిర్వహిస్తూ వేయించిన చికెన్ అమ్మడం ప్రారంభించాడు. ఆ సమయంలో సాండర్స్ తన "సీక్రెట్ రెసిపీ" (రహస్య వంటకం) ను, ప్రెజర్ ఫ్రైయర్‌లో చికెన్ వంటలకు పేటెంటు హక్కులు పొంది వాటిని అభివృద్ధి చేశాడు. సాండర్స్ రెస్టారెంట్ రంగంలో ఫ్రాంఛైజింగ్ (గొలుసుకట్టు దుకాణాలు) భావన సామర్థ్యాన్ని గుర్తించాడు. మొదటి KFC ఫ్రాంచైజ్ 1952 లో ఉటా లోని సౌత్ సాల్ట్ లేక్‌లో ప్రారంభించబడింది. తన అసలు రెస్టారెంట్ మూసివేసిన తరువాత, తన వేయించిన చికెన్‌ను దేశవ్యాప్తంగా ఫ్రాంఛైజ్ చేయడానికి పూర్తి సమయం కేటాయించాడు. (ఇంకా…) |