వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2020 38వ వారం
స్వరూపం
సోడియం హైడ్రాక్సైడ్ |
---|
సోడియం హైడ్రాక్సైడ్ సాధారణంగా క్షారజలం, కాస్టిక్ సోడాగా మనకు సుపరిచితం. ఇది అకర్బన సమ్మేళనం. దీని ఫార్ములా NaOH. ఇది ఘన రూపంలో ఉన్న అయానిక సమ్మేళనం. దీనిలో సోడియం Na+ కాటయాన్లు , హైడ్రాక్సైడ్ OH- ఆనయాన్లు ఉంటాయి. సోడియం హైడ్రాక్సైడ్ అత్యంత దాహక క్షారం, క్షార ద్రావణం. ఇది సాధారణ పరిసర ఉష్ణోగ్రతలలో ప్రోటీన్లను కుళ్ళిపోయేటట్లు చేస్తుంది. ఇది తీవ్రమైన రసాయన కాలిన గాయాలకు కారణం కావచ్చు. ఇది నీటిలో కరుగుతుంది. 12.3 నుండి 61.8 °C వరకు ఉష్ణోగ్రత వద్ద నీటితో స్పటికీకరణం చెంది NaOH·H 2O అనే మోనో హైడ్రైడ్ ఏర్పరుస్తుంది. వాణిజ్య పరంగా లభ్యమవుతున్న "సోడియం హైడ్రాక్సైడ్" సాధారణంగా మోనో హైడ్రేట్. ప్రచురించిన సమాచారం ప్రకారం దీనికి బదులుగా అన్‌హైడ్రస్ సమ్మేళనము (నీటి అణువులను తొలగించిన సమ్మేళనం) NaOH ను ఉపయోగిస్తున్నారు. సరళమైన హైడ్రాక్సైడ్లలో ఒకటిగా, రసాయన శాస్త్రం అభ్యసించే విద్యార్థులకు పిహెచ్ స్కేల్‌ను ప్రదర్శించడానికి తటస్థ నీరు, ఆమ్ల హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో పాటు దీనిని తరచుగా ఉపయోగిస్తారు. సోడియం హైడ్రాక్సైడ్ అనేక పరిశ్రమలలో ఉపయోగించబడుతుంది. దీనిని కర్ర గుజ్జు, కాగితం, వస్త్రాలు, తాగునీరు, సబ్బులు, డిటర్జెంట్ల తయారీలో, డ్రెయిన్ క్లీనర్‌గా ఉపయోగిస్తారు. 2004 లో ప్రపంచవ్యాప్త ఉత్పత్తి సుమారు 60 మిలియన్ టన్నులు కాగా, డిమాండ్ 51 మిలియన్ టన్నులు. (ఇంకా…) |