వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2021 19వ వారం
స్వరూపం
దక్షిణ భారతదేశం |
---|
తూర్పు కనుమలు, పడమటి కనుమలు మధ్య గల దక్కన్ పీఠభూమితో దక్షిణ భారతదేశం భౌగోళికంగా కూడా వైవిధ్యమైనది. తుంగభద్ర, కావేరి, కృష్ణ, గోదావరి ఇచ్చటి ముఖ్యనదులు. ఈ ప్రాంతాన్ని శాతవాహనులు, ఆంధ్ర ఇక్ష్వాకులు, చోళులు, పాండ్యులు, చేరులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, హొయసల, విజయనగర రాజులు మొదలైన రాజులు పరిపాలించారు. ఈ రాజవంశాలలో కొన్ని శ్రీలంక, శ్రీవిజయలను జయించడం వలన ఇప్పటికీ వారి జీవన విధానాలలో దక్షిణ భారత సాంస్కృతిక ప్రభావం కనిపిస్తుంది. |