వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2022 36వ వారం
ఎస్. శ్రీనివాస అయ్యంగార్ |
---|
శేషాద్రి శ్రీనివాస అయ్యంగార్ భారత భారతీయ న్యాయవాదిగా, స్వాతంత్ర్య సమరయోధుడుగా, రాజకీయ నాయకుడు గుర్తింపు పొందాడు. అయ్యంగార్ 1916 నుండి 1920 వరకు మద్రాస్ ప్రెసిడెన్సీకి అడ్వకేట్ జనరలుగా పనిచేసాడు.1912 నుండి 1920 వరకు బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నాడు. 1916 నుండి 1920 వరకు మద్రాస్ ప్రెసిడెన్సీ న్యాయ సభ్యుడిగా, స్వరాజ్య పార్టీ వర్గానికి అధ్యక్షుడిగా పనిచేశారు. 1923 నుండి 1930 వరకు ఇండియన్ నేషనల్ కాంగ్రెసు సభ్యుడుగా పనిచేసాడు. శ్రీనివాస అయ్యంగార్ ప్రఖ్యాత న్యాయవాది, మద్రాసు మొదటి భారత అడ్వకేట్ జనరల్ అయిన సర్ వి. భాష్యం అయ్యంగార్ అల్లుడు. అయ్యంగార్ అనుచరులు అయనను " లయన్ ఆఫ్ ది సౌత్ " అని పిలిచారు. శ్రీనివాస అయ్యంగార్ మద్రాస్ ప్రెసిడెన్సీలోని రామనాథపురం జిల్లాలో జన్మించాడు. ఆయన న్యాయశాస్త్రంలో పట్టభద్రుడయ్యాడై మద్రాస్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేసి 1916 లో అడ్వకేట్ జనరల్ అయ్యాడు. తరువాత ఆయన బార్ కౌన్సిల్ సభ్యుడిగా కూడా పనిచేశాడు. గవర్నరు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ న్యాయ సభ్యుడిగా ప్రతిపాదించబడ్డాడు. 1920 లో జల్లియన్‌వాలా బాగ్ ఊచకోతకు నిరసనగా గవర్నరు ఎగ్జిక్యూటివ్ కౌన్సిలులో తన తన అడ్వకేట్ జనరల్ పదవికి రాజీనామా చేసి తన సి.ఐ.ఇ.ను తిరిగి ఇచ్చి భారత జాతీయ కాంగ్రెసులో చేరారి సహకారేతర ఉద్యమంలో పాల్గొన్నారు. అయినప్పటికీ 1923 లో ఎన్నికలలో పాల్గొనడం గురించి మహాత్మా గాంధీతో విభేదాల కారణంగా మోతీలాల్ నెహ్రూ, చిత్తరంజన్ దాస్ వంటి ఇతర నాయకుల నుండి విడిపోయాడు. విడిపోయిన తరువాత స్వరాజ్య పార్టీని ఏర్పాటు చేసాడు.
|