వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2023 08వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హ్యూస్టన్

హ్యూస్టన్ అమెరికాలో పెద్ద నగరాలలో నాల్గవది అంతేకాక టెక్సాస్ రాష్ట్రంలోని అతి పెద్ద నగరం. 2000ల జనాభా లెక్కల ప్రకారం 600 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో 22 లక్షల జనాభా ఉన్నట్లు అంచనా. హ్యూస్టన్ నగరం హర్రీస్ కౌటీ యొక్క నిర్వహణా కేంద్రం. గ్రేటర్ హ్యూస్టన్‌గా పిలవబడే ఈ నగరం 56 లక్షల జనాభాతో అమెరికాలోనే అతి పెద్ద మహా నగరమైన హ్యూస్టన్-షుగర్ లాండ్-బేటౌన్ లకు వ్యాపార కేంద్రం. హ్యూస్టన్ నగరం 1836 ఆగస్టు 30వ తారీఖున ఆగస్టస్ చాప్మెన్ అలెన్, జాన్ కిర్బ్య్ అలెన్‌ సోదరులచే స్థాపించ బడింది. 1837 జూన్ 5 నుండి గుర్తింపు పొంది రిపబ్లికన్ ఆఫ్ టెక్సాస్ ప్రెసిడెంట్ జ్ఞాపకార్ధం హ్యూస్టన్ పేరుతో వ్యవహరించబడసాగింది. శామ్ హ్యూస్టన్ జనరల్‌గా ఉన్న కాలంలో ఈ నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో బాటిల్ ఆఫ్ శాన్ జాసిన్టో యుద్ధానికి నాయకత్వం వహించం విశేషం. హార్బర్, రైల్ పట్టాల కర్మాగారంతో 1901లో ఆయిల్ నిలువలు కనిపెట్టడం నగరజనాభా క్రమాభివృద్ధికి దోహదమైంది. ఆరోగ్య సంబంధిత పరిశోధనలకు, పరిశ్రమలకు అంతర్జాతీయ కేంద్రమైన టెక్సాస్ మెడికల్ సెంటర్ , మిషన్ కంట్రోల్ సెంటర్ ఉన్న ప్రాంతాలలో స్థాపించబడిన నాసాకు చెందిన స్పేస్ సెంటర్ ఈ నగరంలోనే మొట్టమొదటిగా ప్రారంభించబడ్డాయి. హ్యూస్టన్ నగరం ఆర్థికరంగం ఇక్కడ అధికంగా స్థాపించబడిన విద్యుత్, వస్తుతయారీ, ఏరోనాటిక్స్, రవాణా, ఆరోగ్య సంబంధిత వస్తు తయారీ కర్మాగారాలపై ఆధారపడి ఉంది. వాణిజ్య పరంగా ఇది గమ్మావరల్డ్ సిటీలలో ఒకటిగా గుర్తించబడింది. ఆయిల్ సంబంధిత వస్తు తయారీలో ఈ నగరం అగ్ర స్థానంలో ఉంది. ఈ నగరంలోని పోర్ట్ ఆఫ్ హ్యూస్టన్ హార్బర్ అమెరికాలో అంతర్జాతీయ జలరవాణాలో మొదటి స్థానంలో ఉంది.
(ఇంకా…)