వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2023 13వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆస్ట్రలోపిథెకస్

ఆస్ట్రలోపిథెకస్ అనేది మానవ పూర్వీకుల్లో ఒకటి. ఆస్ట్రలో అనే లాటిన్ మాటకు "దక్షిణాదికి చెందిన" అని, పిథెకోస్ అనే గ్రీకు మాటకు "కోతి" అనీ అర్థం. వెరసి ఆస్ట్రలోపిథెకస్ అంటే దక్షిణాది కోతి అని చెప్పుకోవచ్చు. అధికారిక ఆస్ట్రలోపిథెసీన్ లేదా ఆస్ట్రలోపిత్ (ఆస్ట్రలోపిథెసిన్ అనే పదానికి ఆస్ట్రోలోపిథెసినా అనే సబ్‌ట్రైబ్‌లో భాగంగా విస్తృత అర్ధం ఉన్నప్పటికీ, ఇందులో ఈ జాతితో పాటు పారాంత్రోపస్, కెన్యాంత్రోపస్, ఆర్డిపిథెకస్, ప్రేయాంత్రోపస్ అనే జాతులు ఉన్నాయి). ఇది హోమినిన్లలో ఒక జీనస్. పాలియోంటాలజీ, పురావస్తు శాస్త్రాల ఆధారాలను బట్టి, ఆస్ట్రలోపిథెకస్ జీనస్ 40 లక్షల సంవత్సరాల కిందట తూర్పు ఆఫ్రికాలో ఉద్భవించి, ఆఫ్రికా ఖండమంతటా వ్యాపించి, చివరికి 20 లక్షల సంవత్సరాల క్రితం అంతరించిపోయింది. ఈ జీనస్‌కు నేరుగా ఆపాదించిన సమూహాల్లో ఇప్పటికి ఏదీ జీవించి లేనప్పటికీ, ఆస్ట్రలోపిథెకస్ అక్షరాలా అంతరించిపోయినట్లు అనిపించదు. కెన్యాంత్రోపస్, పారాంత్రోపస్, హోమో జెనరాలు ఆస్ట్రలోపిథెకస్ ఆఫ్రికానస్, ఆస్ట్రలోపిథెకస్ సెడీబా ల నుండి ఉద్భవించి ఉండవచ్చు. ఆ సమయంలో, ఆస్ట్రలోపిథెకస్ అఫారెన్సిస్, ఎ. ఆఫ్రికానస్, ఎ. అనామెన్సిస్, ఎ. బహ్రెల్‌గజాలి, ఎ. డెయిరెమెడా (ప్రతిపాదిత), ఎ. గార్హి, ఎ. సెడీబా వంటి అనేక ఆస్ట్రాలోపిథెసీన్ జాతులు ఉద్భవించాయి.
(ఇంకా…)