వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2023 36వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సర్వేపల్లి రాధాకృష్ణన్

సర్వేపల్లి రాధాకృష్ణన్ (1888 సెప్టెంబరు 5 - 1975 ఏప్రిల్ 17; స్థానికంగా రాధాకృష్ణయ్య ) 1962 నుండి 1967 వరకు భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా పనిచేసిన భారతీయ రాజకీయవేత్త, తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు. అతను గతంలో 1952 నుండి 1962 వరకు భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా పనిచేశాడు. అతను 1949 నుండి 1952 వరకు సోవియట్ యూనియన్‌లో భారతదేశానికి రెండవ రాయబారిగా ఉన్నాడు. అతను 1939 నుండి 1948 వరకు బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి నాల్గవ వైస్-ఛాన్సలర్‌గా, 1931 నుండి 1936 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి రెండవ వైస్-ఛాన్సలర్‌గా కూడా ఉన్నాడు. రాధాకృష్ణన్ తులనాత్మక మతం, తత్వశాస్త్రం యొక్క 20వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన, విశిష్టమైన పండితులలో ఒకరిగా పరిగణించబడ్డాడు. అతను కలకత్తా విశ్వవిద్యాలయంలో కింగ్ జార్జ్ వి చైర్ ఆఫ్ మెంటల్ అండ్ మోరల్ సైన్స్‌లో 1921 నుండి 1932 వరకు, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని స్పాల్డింగ్ చైర్ ఆఫ్ ఈస్టర్న్ రెలిజియన్ అండ్ ఎథిక్స్ కు 1936 నుండి 1952 వరకు తన సేవలనందించాడు. భారతీయ తాత్వికచింతనలో పాశ్చాత్య తత్వాన్ని ప్రవేశ పెట్టారని ప్రతీతి. రెండు పర్యాయాలు ఉపరాష్ట్రపతి పదవి చేపట్టి, తరువాత రాష్ట్రపతిగా ఒక పర్యాయం పదవిని చేపట్టి, భారతదేశపు అత్యంత క్లిష్టకాలంలో (చైనా, పాకిస్తాన్లతో యుద్ధ సమయం) ప్రధానులకు మార్గనిర్దేశం చేశాడు.
(ఇంకా…)